Wedding Card: వాటే క్రియేటివిటీ.. ఇలాంటి పెళ్లి కార్డు మీరెప్పుడైనా చూశారా..? వైరల్‌ అవుతున్న వెరైటీ శుభలేఖ.

|

Feb 01, 2023 | 9:31 PM

ఇంటర్‌నెట్‌ వినియోగం విచ్చలవిడిగా మారిపోయింది. సోషల్ మీడియా వేదికగా చిత్ర విచిత్రమైన పోస్ట్‌లు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. అదే తరహాలో ఒక వెడ్డింగ్ కార్డు


తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ఏడిద వెంకటేష్‌.. తన చిన్న కుమార్తె పెళ్లికి రెండు వేల రూపాయల నోటు తరహాలో శుభలేఖ అచ్చు వేయించారు. చిన్న పరిమాణంలోనే.. 2 వేల రూపాయల నోటును పోలినట్లుగా తయారు చేయించిన ఈ పెళ్లి కార్డు అందరినీ ఆకట్టుకుంటోంది..కరెన్సీ నోటుపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అని అక్షరాలుండే చోట రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ లవ్‌ అనే పదం చేర్చారు. వివాహ బంధంతో ఒక్కటవుతున్నాం.. చివరి శ్వాసవరకూ కలసి ఉంటామంటూ కార్డుపై ప్రస్తావించారు. అలాగే నోటుకు మరోవైపు వివాహానికి సంబంధించి వివరాలు ముద్రించారు. ఈ వెరైటీ శుభలేఖల్ని బంధువులు, స్నేహితులకు అందిస్తుంటే.. నిజంగా రెండు వేల నోటు అనుకుని తీసుకునేందుకు మొహమాటపడ్డారు. ఆ తర్వాత 2వేల నోటును పోలి ఉన్న శుభలేఖ అని తెలుసుకుని.. వాళ్ల క్రియేటివీటీకి ఫిదా అయ్యారు. అంతేకాదు 2017లో వెంకటేష్‌ తన పెద్ద కుమార్తె పెళ్లికి బ్యాంక్‌ ఏటీఎం కార్డు తరహాలో శుభలేఖను తయారు చేయించారు. వెంకటేష్‌ క్రియేటివిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వధూవరులకు ప్రశంసల శుభాకాంక్షలు కురిపిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Published on: Feb 01, 2023 09:31 PM