AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Variety Video: వార్తల హెడ్‌లైన్స్‌ మాదిరిగా.. పెళ్ళి బ్యానర్‌.. ప్రేమ జంటకు ఫ్రెండ్స్ వెరైటీ గిఫ్ట్.. నెట్టింట హల్ చల్..

Variety Video: వార్తల హెడ్‌లైన్స్‌ మాదిరిగా.. పెళ్ళి బ్యానర్‌.. ప్రేమ జంటకు ఫ్రెండ్స్ వెరైటీ గిఫ్ట్.. నెట్టింట హల్ చల్..

Anil kumar poka
|

Updated on: Sep 06, 2022 | 9:11 AM

Share

తమిళనాడు దిండుక్కల్ జిల్లా పళనిలో గౌతమ్ , పావని అనే ప్రేమికుల జంట పెద్దలను ఒప్పించి వివాహానికి ఏర్పాట్లు చేసుకున్నారు. కాగా.. గౌతమ్ స్నేహితులు వీధుల్లో ఏర్పాటు చేసిన బ్యానర్‌లు


తమిళనాడు దిండుక్కల్ జిల్లా పళనిలో గౌతమ్ , పావని అనే ప్రేమికుల జంట పెద్దలను ఒప్పించి వివాహానికి ఏర్పాట్లు చేసుకున్నారు. కాగా.. గౌతమ్ స్నేహితులు వీధుల్లో ఏర్పాటు చేసిన బ్యానర్‌లు తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్ గా మారాయి. బ్యానర్లలో దినపత్రికల్లో హెడ్‌లైన్స్‌ తరహాలో మాటర్‌ ఉండటం ఇందుకు కారణం. క్రైమ్ హెడ్‌లైన్స్‌ తరహాలో పెళ్లితో జీవిత ఖైదు శిక్షకి సిద్ధపడ్డ మిత్రుడికి శుభాకాంక్షలు అంటూ నవ్వులు పూయించారు. క్రీడా వార్తల తరహాలో భోజనాల్లో మటన్ కోసం యువకులు పోటీపడ్డనున్నారు అంటూ రాసుకొచ్చారు. చివరిగా మాకూ అమ్మాయి కావాలి, మేం చదువుకున్నాం , ఏ పనీ లేకుండా ఖాళీగా ఉన్నాం. పెళ్ళికి వచ్చిన అతిథులకు విన్నపం.. కులం , మతం తో మాకు సంబంధం లేదు , మమ్మల్ని భరించే శక్తీ మీ అమ్మాయికి ఉంటె మాకిచ్చి పెళ్లి చేయండి … కట్నం మీరు ఎంత ఇచ్చిన తీసుకుంటాం అని సరదాగా పెళ్లి ఇన్విటేషన్ తరహాలో బ్యానర్ ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్ ని కొంతమంది వ్యతిరేకిస్తున్నా ఇంకొందరు సరదాగా తీసుకుని నవ్వుకుంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Bride Running on Road: నీ తల్లీ అంటూ మరోసారి తెలంగాణ శకుంతలను గుర్తు చేసిన మహిళా.. నన్ను పెళ్లి చేసుకుంటావా..లేదా..!

Mother sentiment: పసితనంలో తల్లిని పోగొట్టుకొని.. ఆమె తల్లి సమాధి వద్ద ఈ పిల్లాడు చేసిన పనికి మీకు కూడా కనీళ్లు ఆగవు..

Published on: Sep 06, 2022 09:11 AM