Weather Report: తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
ఏపీకి మరో ముప్పు పొంచి ఉంది. రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో ఏపీ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని.. మధ్యాహ్నం 3 తర్వాత కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో ఓ గంటపాటూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది . అరేబియా సముద్రంలో గాలి వేగం గంటకు 30 కిలోమీటర్లుగా ఉంది. ఐతే ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం గంటకు 15 నుంచి 25 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
ఏపీకి మరో ముప్పు పొంచి ఉంది. రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో ఏపీ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని…. మధ్యాహ్నం 3 తర్వాత కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో ఓ గంటపాటూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది . అరేబియా సముద్రంలో గాలి వేగం గంటకు 30 కిలోమీటర్లుగా ఉంది. ఐతే ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం గంటకు 15 నుంచి 25 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో వరదల నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విజయవాడ ప్రజలను ఈ వార్త మరింత భయాందోళనకు గురి చేస్తోంది. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాకు ఆరెంజ్ అలర్ట్, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, యానాం, ఏలూరు, గుంటూరు, బాపట్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిందింది.
మరో వైపు తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కుుస్తున్న వర్షాలతో రాజానగరం మండలం గాడాల దగ్గర జాతీయ రహదారిపైకి భారీగా వరద నీరు చేరుకుంది. జాతీయ రహదారిపై భారీగా ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాడు సాయంతో రాకపోకలు సాగిస్తున్నారు ప్రజలు. రాజమండ్రి గామాన్ బ్రిడ్జి దగ్గర భారీగా వరద నీరు నిలిచిపోయింది. మరోసారి తెలంగాణకు భారీ వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఇవాళ తెలంగాణ అంతటా వర్షాలు తేలికపాటి నుంచి మోస్తరుగా కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణలో కొన్ని చోట్ల మాత్రం భారీగా వర్షాలు కురిసే అవకాశముంది. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, సిద్దిపేట, హనుమకొండ, యాదాద్రి జిల్లాలకు భారీ వర్ష సూచన చేసిన అధికారులు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆల్రెడీ ఉదయం నుంచి తెలంగాణలో పలుచోట్ల వాన పడుతోంది. హైదరాబాద్‌లోనూ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం చెప్పింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.