Telangana: మోటారు లేకుండానే 50 ఏళ్లుగా బోరు నుంచి ఉప్పొంగుతున్న గంగ..
వర్షాకాలంలో భూగర్భ జలాలు పెరిగి.. బోర్ల నుంచి నీరు ఉబికివచ్చిన ఘటనలు చూశాం. కానీ.. ఆ బోరు నుంచి 50 ఏళ్ల వాటర్ అలా వస్తూనే ఉన్నాయి. అది కూాడ మోటార్ పెట్టుకుండానే. దీంతో ఇది గంగమ్మ మహత్యం అని కొందరు అంటున్నారు. ఆ బోరు నుంచి వచ్చే వాటర్.. గ్రామంలోని అవసరాలకు చక్కగా ఉపయోగపడుతుంది కూడా....
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం మామకన్ను గ్రామంలో ఒక బోర్ నుంచి మోటార్ లేకుండానే నీరు ఉబికివస్తుంది. 50 ఏళ్ల క్రితం గ్రామస్తులకు నీటి ఎద్దడి ఉండడంతో మంచినీటి కోసం అధికారులు బోరు వేయించారు. అయితే బోరు వేసిన నాటి నుండి మోటారు సహాయం లేకుండా 2 హార్స్ పవర్ మోటర్ వేస్తే ఎంత వాటర్ వస్తుందో అంత ధార… మోటార్ లేకుండానే వస్తుంది. అది చూసిన గ్రామస్తులంతా ఆ రోజుల్లో ఆశ్చర్యంగా తిలకించారు. కానీ ఏళ్లు గడుస్తున్నా.. నీటిని నిరంతరం వినియోగించుకుంటున్నా… అందులో నీరు తగ్గడం మాత్రం జరగడం లేదు. ఈ బోరు గ్రామ అవసరాలకు ఎంతో ఉపయోగపడుతుంది. పక్కనే ఉన్న ఆశ్రమ స్కూలులో 300 మంది విద్యార్థులకు ఈ నీరు ఉపయోగిస్తున్నారు. ఈ గ్రామ రైతులు కూడా ఈ నీటితో పంటలు పండించుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ బోరు బావి 50 ఏళ్ల క్రితం నుండి మోటార్ సహాయం లేకుండా బోరు నుంచి నీరు ఉబికిరావడం విశేషం. ఇప్పటికీ దారి వెంట పోయే వాళ్లంతా కూడా ఈ బోరును ఆసక్తికరంగా తిలకిస్తూ ఉంటారు. దాని గురించి చాలా గొప్పగా చెబుతుంటారు ఈ గ్రామస్తులు. నేటి తరం పిల్లలైతే తమ తాత ముత్తాతల నుండి ఈ బోరు ఇలానే నీళ్లె పోస్తుందని చెప్తున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఆదమరిచి నిద్రపోతున్న శునకం.. మేక ఏం చేసిందో చూడండి

ఎండ వేడి తట్టుకోలేక ఏసీ ఆన్ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో

పిచ్చి పీక్స్‌కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది

ఒక్క టూత్ బ్రష్‌తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి

ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..
