దారుణం.. పెళ్లయిన మూడు నెలలకే భార్యను చంపి..ప్రియురాలితో వీడియో
ప్రేమ కోసం ఒకరినే, డబ్బు కోసం మరొకరిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో కట్టుకున్న భార్యను నాలుగు నెలలు తిరక ముందే కాటికి పంపించేసాడు. తాను చదువుకునే రోజుల్లో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని భావించిన ఈ వంచకుడు డబ్బు కోసం కట్న కానుకలతో వచ్చే అమ్మాయిని చూసి వివాహం చేసుకున్నాడు. డబ్బు వచ్చింది, జీవితంలో సెటిల్ అయ్యాననుకోగానే ప్రియురాలి మీదకు మనసు మళ్ళింది. భార్య అడ్డుగా అనిపించింది. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం అగ్ని సాక్షిగా పెళ్లాడిన భార్యను దారుణంగా హతమార్చాడు. చివరికి పాపం పండి కటకటాల పాలు అయ్యాడు.
ఈ ఘటన వరంగల్లో చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా, మరిపేడు మండలం, బాల్యతండాకు చెందిన గణేష్ కు సూర్యాపేట జిల్లా దక్షిణపల్లి గ్రామానికి చెందిన గౌతమీతో ఈ ఏడాది మే 18న వివాహం జరిగింది. గణేష్ కు కోరిన కట్న కానుకలు ఇచ్చి కోరిన విధంగా గ్రాండ్ గా వివాహం చేశారు. అయితే అప్పటికే తన క్లాస్ మేట్ తో ప్రేమయాణం కొనసాగిస్తున్న గణేష్ వరంగల్లో ఆటో డ్రైవింగ్ చేస్తే బాగా సంపాదించవచ్చు అని అందరినీ నమ్మించి భార్యతో సహా వరంగల్లో కాపురం పెట్టాడు. అంతా ఓకే, తాను అనుకున్నట్లే డబ్బు వచ్చింది, ఆటో కూడా కొనుక్కున్నాడు. జీవితం బాగానే సాగుతుంది. మరోవైపు తన క్లాస్ మేట్ తో ప్రేమ కంటిన్యూ చేస్తున్న గణేష్ ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అందుకు ఎలాగైనా భార్యను వదిలించుకోవాలని ప్లాన్ వేశాడు. ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో భార్యను దిండుతో నొక్కి ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. ఆ తర్వాత తన భార్యకు శ్వాస ఆడటం లేదని అందరినీ నమ్మించి 108కి కూడా ఫోన్ చేశాడు.
మరిన్ని వీడియోల కోసం :