మూడు నెలల్లో పదిమంది పుస్తెలతాళ్ళు తెంచుకుపోయాడు.. ఎందుకో తెలిస్తే

Updated on: Aug 29, 2025 | 3:34 PM

ప్రేమలో పడ్డాడు.. ఆ ప్రియురాలిని మెయింటైన్ చేయడం కోసం చైన్ స్నాచింగ్ చేశాడు. మొదటిసారి చైన్‌ స్నాచింగ్‌ చేసినప్పుడు కాస్త భయపడినా.. రాను రాను అలవాటైపోవడంతో.. అత్యాశ పుట్టింది..ఇదేదో బాగుందనుకున్నాడు.. దీనినే వృత్తిగా మార్చుకున్నాడు. మూడు నెలల వ్యవధిలో పదిమంది మహిళల మెడలోని పుస్తెలతాళ్లు తెంచుకుపోయాడు.

చోరీచేసిన బైక్స్ పై వెళ్ళి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. వరంగల్ కమిషనరేట్ లో పోలీసులు, ఒంటరి మహిళలకు ప్రశాంతత లేకుండా చేసిన ఆ 420 గాడు ఎట్టకేలకు పట్టుబడ్డాడు. అతని వద్ద పావు కిలోకు పైగా బంగారు పుస్తెల తాళ్ళు, 3 బైక్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడిని రిమాండ్ కు తరలించారు. నిందితుడు హనుమకొండ జిల్లా ఎక్కతుర్తి మండలం దామెర గ్రామానికి చెందిన హరీష్ గా గుర్తించారు. ఇతను ఏడాది క్రితం యువతితో ప్రేమలో పడ్డాడు. ఆమెను మెయింటైన్ చేయడానికి చేతిలో డబ్బు లేకపోవడంతో ఒక చైన్ స్నాచింగ్ చేశాడు. ఆ బంగారు గొలుసు తాకట్టుపెట్టి కొంత డబ్బు తీసుకొని ఆ డబ్బుతో జల్సాగా తిరిగాడు. ఇదేదో బాగుందనుకొని ఇదే వృత్తిగా ఎంచుకున్నాడు. నాలుగు నెలల వ్యవధిలో మూడు ద్విచక్ర వాహనాలు దొంగతనం చేసిన హరీష్ ఆ బైక్స్ పై వెళ్లి చైన్ స్నాచింగ్స్ కు పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించారు. హరీష్ ను అరెస్టు చేసిన పోలీసులు అతని వద్ద 237 గ్రాముల బంగారం, మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని మీడియా ముందు హాజరు పరిచిన వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్.. రిమాండ్ కు తరలించారు.. ప్రేమ వ్యవహారమే ఇతని చైన్ స్నాచర్ గా మార్చిందని తెలిపారు..

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అది ఏలియన్‌ నౌకా.. తోకచుక్కా..

చడీచప్పుడు కాకుండా ప్రియుడితో ఎంగేజ్‌మెంట్.. షాకిచ్చిన హీరోయిన్

జియో,ఎయిర్‌టెల్‌కు BSNL షాక్..

నా భార్య తిరిగొచ్చింది.. కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్ భర్త..

కోనేరు కనిపిస్తే దిగడమేనా? పద్ధతీ పాడూ లేదా? ఆలయంలో అపచారం