ఇదో రాబందు కథ..15 వేల కిలోమీటర్ల ప్రయాణం.. తిరిగి సేఫ్‌గా భారత్‌కు
పక్షుల వలసలు ప్రకృతి అద్భుతాలు. మధ్యప్రదేశ్ నుండి బయలుదేరిన 'మారిచ్' అనే యురేసియన్ గ్రిఫాన్ రాబందు 15,000 కి.మీ. ప్రయాణించి తిరిగి భారతదేశానికి చేరుకుంది. పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మీదుగా సాగిన ఈ ప్రయాణాన్ని శాటిలైట్ ద్వారా పర్యవేక్షించారు. రాబందులు వ్యాధులను నివారించి, పర్యావరణ సమతుల్యతకు తోడ్పడతాయి. సైబీరియా పక్షులు తెలంగాణకు వలస వచ్చినట్లు కూడా ఈ కథనం వివరిస్తుంది.
పక్షులు వలస వెల్లడం అనేది ప్రకృతి ప్రపంచంలో ఓ అద్భుతం. మహాసముద్రాల మీదుగా వేల కిలోమీటర్లు పయనించి వచ్చే పక్షుల గురించి శాస్త్రేవేత్తలు పరిశోధనలు చేస్తుంటారు. వాటి ప్రయాణ మార్గాలేంటి, అవి ఎంత దూరం ప్రయాణిస్తాయి, విశ్రాంతి ఎలా తీసుకుంటాయి వంటి విషయాలు తెలుసుకునేందుకు పక్షి శాస్త్రవేత్తలు పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. ఎక్కడో వేల కిలోమీరటర్ల దూరంలో ఉన్న సైబీరియాలోని పక్షులు మన తెలంగాణలోని గ్రామాలకు వచ్చి పిల్లలు చేసి వెళుతుంటాయి. జనగామ జిల్లా చిన్నమడూరు వంటి గ్రామాల్లో ఈ దృశ్యాలు కనిపిస్తుంటాయి. ఈ క్రమంలో ఓ రాబందు ప్రయాణం ప్రస్తుతం దేశంలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది మార్చిలో మధ్యప్రదేశ్‌లోని విదిశా జిల్లాలోని హలాలీ ఆనకట్ట నుంచి బయలుదేరిన యురేసియన్ గ్రిఫాన్ రాబందు ‘మారిచ్’ 15 వేల కిలోమీటర్ల ప్రయాణాన్ని ముగించుకొని భారతదేశానికి సురక్షితంగా తిరిగి వచ్చిందని అటవీ శాఖాధికారి బుధవారం తెలిపారు. ఈ పక్షి పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, ఉజ్బెకిస్థాన్, కజకస్థాన్‌ల గుండా ప్రయాణించిందని వెల్లడించారు. ప్రస్తుతం రాజస్థాన్‌లోని ధోల్‌పుర్ జిల్లాలో తిరుగుతోందని విదిశా డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ హేమంత్ యాదవ్ పేర్కొన్నారు. ఉపగ్రహ రేడియో కాలర్ సహాయంతో దాని కదలికలను అటవీ శాఖ గమనిస్తోందన్నారు. జనవరి 29న సత్నా జిల్లాలోని నాగౌర్ గ్రామంలో ఈ పక్షి గాయపడిన స్థితిలో కనిపించిందని అధికారులు తెలిపారు. తొలుత ముకుంద్‌పుర్ జూ, తర్వాత భోపాల్ వన విహార్ జాతీయ పార్కులో దీనికి చికిత్స అందించినట్లు యాదవ్ పేర్కొన్నారు. రెండు నెలల తర్వాత హలాలీ ఆనకట్ట వద్ద దీన్ని విడుదల చేశారన్నారు. ఇది జంతు కళేబరాలను తింటూ వ్యాధులు వ్యాప్తి చెందకుండా నిరోధిస్తుంది. నేల, నీటి నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఈ రాబందు ఐరోపా, ఉత్తర ఆఫ్రికా, ఆసియాలోని పర్వత ప్రాంతాల్లో కనిపిస్తుంది. వేడి గాలి ప్రవాహాలలోనూ గంటల తరబడి ఎగురుతుంది అని నిపుణులు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నిందితుడ్ని పట్టించిన ల్యాప్‌టాప్‌పై డీఎన్ఏ !! అమెరికాలో ఏపీ మహిళ హత్య..
ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా డ్యూటీ చేసిన ఎమ్మెల్యే
Rahul Sipligunj: సార్.. మీరు మా పెళ్ళికి తప్పకుండ రావాలి !!
