Bogatha Waterfall: తెలంగాణ నయాగరా అందం చూడతరమా.? బొగత జలపాతం జలకళ..

|

Jul 11, 2024 | 4:57 PM

తెలంగాణాలోని ములుగు జిల్లాలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాజేడు మండలంలోని తెలంగాణ నయాగారా బొగత జలపాతం జోరుగా ప్రవహిస్తోంది. కొన్ని నెలలుగా బోసిపోయిన బొగత జలపాతం ఇటీవలే కురుస్తున్న వర్షాలకు కళకళలాడుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో ఈ జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నీటి తుంపరలు, జల సవ్వడితో అడవి మనోహరంగా దర్శనమిస్తోంది.

తెలంగాణాలోని ములుగు జిల్లాలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాజేడు మండలంలోని తెలంగాణ నయాగారా బొగత జలపాతం జోరుగా ప్రవహిస్తోంది. కొన్ని నెలలుగా బోసిపోయిన బొగత జలపాతం ఇటీవలే కురుస్తున్న వర్షాలకు కళకళలాడుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో ఈ జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నీటి తుంపరలు, జల సవ్వడితో అడవి మనోహరంగా దర్శనమిస్తోంది. పెనుగోలు అటవీ ప్రాంతంలో కొండ కోనలు, వాగులు, వంకల నుంచి జలధార ప్రవహిస్తూ జలపాతం వద్ద 50 ఫీట్ల ఎత్తుతో జాలువారుతూ మైమరిపిస్తోంది. కొండల పైనుంచి దూకుతున్న పాలనురగ వంటి జలధారలు కనువిందు చేస్తున్నాయి. ఈ జలపాతాన్ని చూసేందుకు దూర ప్రాంతాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో పోటెత్తుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులతో పరిసరాలు కోలాహాలంగా మారాయి. కొత్త అందాలతో తెలంగాణ నయాగారా చూపరులకు ఎంతగానో కనువిందు చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.