Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటి గేటు ముందు నిల్చున్న వ్యక్తి..ఇంతలో అక్కడికి వచ్చిన ఎద్దు..తర్వాత?వీడియో

ఇంటి గేటు ముందు నిల్చున్న వ్యక్తి..ఇంతలో అక్కడికి వచ్చిన ఎద్దు..తర్వాత?వీడియో

Samatha J
|

Updated on: Jun 13, 2025 | 11:02 AM

Share

ఆవులు, ఎద్దులు, గేదెలు లాంటి పశువులను రైతులు తమ ఇళ్ల వద్దను పశువుల కొట్టాములోను జాగ్రత్తగా కట్టి ఉంచాలి. అలా కాకుండా కొందరు వాటిని బయటకు వదిలేస్తుంటారు. అలాంటి పశువులు రోడ్లపై తిరుగుతూ వాహనదారులకు, పాదచారులకు కూడా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. ఒక్కోసారి అవి ప్రమాదాల బారిన పడితే ఒక్కో సందర్భంలో పశువులు మనుషులపై దాడికి పాల్పడుతూ ఉంటాయి. అలా ఇంటి గేటు ముందు నిల్చున్న ఒక వృద్ధుడిపై రోడ్డుపై వెళ్తున్న ఒక ఎద్దు దాడి చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దే

శ రాజధాని ఢిల్లీలో వీధి పశువుల బెడద మరోసారి తీవ్ర రూపం దాల్చింది. ఛత్తర్పూర్ ప్రాంతంలో ఒక ఎద్దు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన స్కూటర్ వద్ద నిల్చున్న ఒక వృద్ధుడిపై అకస్మాత్తుగా దాడి చేసింది. ఎన్నాళ్ల నుంచో అతనిపై కోపంతో ఎప్పుడు దొరుకుతదా అని ఎదురు చూస్తున్నట్లు ఒక్కసారిగా ఆ వృద్ధుడిపై కొమ్ములతో పైకెత్తి నేలకేసి కొట్టింది. దారుణంగా కాళ్ళతో తొక్క పడేసింది. ఆ తర్వాత ఆ బాధితుడిని రోడ్డు మధ్యలో ఈడ్చుకెళ్లి మళ్ళీ దాడి చేసింది. వృద్ధుడి కేకలు విన్న ఆ ఇంట్లోని వారు పరుగు పరుగున అక్కడికి వచ్చారు. ఎద్దును తరిమే ప్రయత్నం చేశారు. కానీ ఆ ఎద్దు వారిపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించింది. అడ్డుకున్న మహిళను కొమ్ములతో పక్కకు నెట్టేసింది. మళ్ళీ వచ్చి వృద్ధుడిపై దాడి చేసింది. ఇంతలో కొందరు స్థానికులు పెద్ద కర్ర పట్టుకొని వచ్చి ఎద్దును తరిమివేశారు.

మరిన్ని వీడియోల కోసం :

వావ్‌.. అట్లుంటది ఏఐ రోబోతోని.. వీడియో

టాయిలెట్‌లో వింత జంతువును చూసి షాక్‌ వీడియో

ఏనుగు ‘షాపింగ్‌’ బిల్లు’ను చెల్లించిన వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వీడియో

ఐడియా అదిరింది.. నెలకు రూ.8 లక్షలు సంపాదిస్తున్న ఆటో డ్రైవర్‌ వీడియో