Viral Video: మనదేశంలో పెళ్లి తరువాత ఊరేగింపు బరాత్‌లో తీన్‌మార్ డ్యాన్సులు సహజం. ఇప్పటికే ఎన్నో వీడియో(Viral Video)లు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. వరుడి తరపు వారైనా, వధువు తరపు వారైనా, స్నేహితులు, ఇరువర్గాల బంధువులు, డ్యాన్సులతో దుమ్ముదులుపుతుంటారు. వీటిలో కొన్ని నిజంగా అద్భుతంగా ఉంటాయి. నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటూ తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇలాంటి కోవకే చెందిన ఓ వీడియో ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చాం.
సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో, బరాత్‌లో ఓ యువకుడు వరుడితో పాటు గుర్రంపై కూర్చొని ఉండడం చూడొచ్చు. ఓవైపు డప్పుల మోతతో ఇక ఆ యువకుడు గుర్రంపై నుంచి పడిపోయేలా తన కళకు పనిచెప్పాడు. దీంతో చుట్టుపక్కల ఉన్న జనాలతో పాటు వధూవరులు కూడా నవ్వడం మొదలుపెట్టారు.
వరుడి కంటే ముందు కూర్చున్న ఈ యువకుడు స్పింగ్‌లాగా తిరుగుతూ నాగిని డ్యాన్స్ చేస్తుండడంతో.. నెటిజన్లను కూడా ఈ వీడియో ఆకట్టుకుంటోంది. దీంతో ఈ వీడియోపై చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు.
Also Read: Alarm Over NeoCov: ప్రపంచం ముంగిట నియోకోవ్ ముప్పు..? ఈ సారి ప్రాణాలకే ముప్పు..(వీడియో)
Watch Video: లైవ్ మ్యాచులో భూకంపం.. 20 సెకన్ల పాటు దద్దరిల్లిన స్డేడియం.. వీడియో వైరల్