AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లికి కుందేలు సాయం.. నెట్టినట వైరల్ అవుతున్న క్యూట్ వీడియో

పిల్లికి కుందేలు సాయం.. నెట్టినట వైరల్ అవుతున్న క్యూట్ వీడియో

Phani CH

|

Updated on: May 22, 2023 | 9:51 PM

ఎవరైనా ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు ఎంతటివారైనా చూస్తూ అలా వదిలేయలేరు. మానవత్వంతో వారిని రక్షించడానికి సాయశక్తులా ప్రయత్నిస్తారు. ఇది కేవలం మనుషుల్లోనే కాదు, జంతువులకూ వర్తిస్తుంది. అందుకు ఉదాహరణే ఈ వీడియో.

ఎవరైనా ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు ఎంతటివారైనా చూస్తూ అలా వదిలేయలేరు. మానవత్వంతో వారిని రక్షించడానికి సాయశక్తులా ప్రయత్నిస్తారు. ఇది కేవలం మనుషుల్లోనే కాదు, జంతువులకూ వర్తిస్తుంది. అందుకు ఉదాహరణే ఈ వీడియో. ఇందులో ఓ చోట రేకుల వెనుక ఇరుక్కుపోయిన పిల్లిని కుందేలు ఎంతో కష్టపడి కాపాడింది. అందుకు సంబంధించిన వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఆ కుందేలు పిల్లిని ఎలా కాపాడిందంటే.. ఇందులో ఓ పిల్లి అవతలికి ఎలా వెళ్లిందో కానీ, కంచెలా వేసిన రేకుల వెనుక ఇరుక్కుపోయింది. తిరిగి ఇవతలికి రాలేక నానా అవస్థలూ పడింది. దాని అవస్థ చూసిన ఓ కుందేలు జాలిపడింది. పిల్లిని ఎలాగైనా సాయం చేయాలనుకుంది. వెంటనే రంగంలోకి దిగింది. తన ముందరి కాళ్లతో రేకుల కింద మట్టిని తవ్వి పిల్లి ఇవతలికి రావడానికి మార్గం ఏర్పాటు చేసింది. పిల్లి ఇవతలికి రాగలదో లేదో చెక్‌ చేసింది. అంతా ఓకే అనుకున్నాక పిల్లి వచ్చి తనకు థాంక్స్‌ చెప్పేవరకూ కూడా ఆగలేదు. వెంటనే అక్కడినుంచి వెళ్లిపోయింది. ఇంతలో పిల్లి సేఫ్‌గా ఇవతలకు వచ్చింది. కుందేలు కోసం వెతికింది..కానీ కనిపించలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇది జంటిల్‌ కుందేలు.. అందుకే ఫలితం ఆశించకుండా సాయం చేసిందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంట్లో అగ్ని ప్రమాదం.. రంగంలోకి దిగిన పోలీసులకు ఊహించని ట్విస్ట్‌ !!

సంతలో మిర్చి బజ్జీలు కొనుక్కుని ఇంటికెళ్లారు.. ఆపై లొట్టలేసుకుంటూ తినగా !!

ఆత్మహత్య ఆలోచనలు ‘ఆ నెల’లోనే ఎక్కువట !!

చిన్నారిని కాపాడిన వ్యక్తికి ఊహించని ట్విస్ట్‌.. అంతలోనే ??

నగలు ఇస్తానన్నా వదలని దొంగ.. చివరికి ??