ఇంట్లో అగ్ని ప్రమాదం.. రంగంలోకి దిగిన పోలీసులకు ఊహించని ట్విస్ట్ !!
సికింద్రాబాద్‌లోని రెజిమెంటల్ బజార్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో శనివారం రాత్రి ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పేసింది. అనంతరం పోలీసులు వచ్చి ఇంట్లో తనిఖీలు చేపట్టారు.
సికింద్రాబాద్‌లోని రెజిమెంటల్ బజార్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో శనివారం రాత్రి ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పేసింది. అనంతరం పోలీసులు వచ్చి ఇంట్లో తనిఖీలు చేపట్టారు. మంటలు ఆర్పిన తర్వాత బయటపడ్డ ట్విస్ట్‌తో పోలీసులకు షాక్ తగిలింది. అసలు విషయం ఏంటంటే.. అగ్నిప్రమాదం జరిగిన ఇంట్లో పోలీసులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. బెడ్ రూమ్‌లో ఏకంగా దాదాపు 5 కోట్ల డబ్బు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంత డబ్బు ఆ ఇంట్లో కనిపించడం, అగ్నిప్రమాదం జరగడంతో అనుమానించిన పోలీసులు వెంటనే క్యాష్ సీజ్ చేశారు. ప్రమాదం జరిగిన ఇంటి యజమాని శ్రీనివాస్‌గా గుర్తించారు. ఇతను ఓ ప్రముఖ కంపెనీలో డీజీఎంగా పనిచేస్తున్నాడు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో శ్రీనివాస్ హైదరాబాద్‌లో లేడు. అయితే ప్రమాదం జరిగిందన్న విషయం తెలుసుకొని ఆగమేఘాల మీద వచ్చిన శ్రీనివాస్.. ఇంట్లో ఉన్న డబ్బును తనిఖీ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. శ్రీనివాస్ డీజీఎంగా పనిచేస్తుండగా.. అదే కంపెనీకి సంబంధించిన గవర్నమెంట్ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ బిజినెస్ కూడా చేస్తున్నాడు. ఇంత మొత్తం ఇంట్లో ఎందుకు ఉందన్న కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. నగదును సీజ్ చేసి స్టేషన్‌కి తరలించారు. ఇక ఈ డబ్బును హవాల మనీగా పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణ పూర్తయితే కానీ అన్ని వివరాలు తెలియవని పోలీసులు చెబుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సంతలో మిర్చి బజ్జీలు కొనుక్కుని ఇంటికెళ్లారు.. ఆపై లొట్టలేసుకుంటూ తినగా !!
ఆత్మహత్య ఆలోచనలు ‘ఆ నెల’లోనే ఎక్కువట !!
చిన్నారిని కాపాడిన వ్యక్తికి ఊహించని ట్విస్ట్.. అంతలోనే ??
నగలు ఇస్తానన్నా వదలని దొంగ.. చివరికి ??
హైవేపై ఆగిఉన్న కారు.. దగ్గరకు వెళ్లి చూసిన పోలీసులు.. చివరకు ??
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

