అసలే కోతి.. దాని చేతికి అద్దం దొరికితే..!
చిలిపి చేష్టలు, అల్లరి పనులకు కేరాఫ్ కోతి. ఎక్కువగా ఆలయాల వద్ద ఉండే కోతులు గుడికి వెళ్లే భక్తులను ఓ ఆటాడుకుంటాయి. వారి చేతుల్లో ఉన్న వస్తువులను లాక్కెళ్లిపోతుంటాయి. మొబైల్స్‌నుంచి కళ్లజోళ్లవరకూ ఏదీ వదిలిపెట్టవు. వాటిని లాక్కెళ్లిపోయి ఏ ఎత్తయిన చెట్టుపైనో, గోడమీదో కూర్చుని భక్తులను ముప్పు తిప్పలు పెడుతుంటాయి.
ఆ కోతిదగ్గరనుంచి తమ వస్తువులను రాబట్టుకోడానికి నానా అవస్థలు పడతారు జనాలు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ కోతి చేతికి అద్దం దొరికింది. ఇంకేముంది అందులో దాని అందం చూసుకొని తెగ మురిసిపోయింది. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటలో జరిగింది. ఎక్కడ దొరికిందోకానీ, ఓ వానరం చేతికి పగిలిన అద్దం ఒకటి దొరికింది. ఆ అద్దాన్ని పట్టుకెళ్ళి గోడమీద కూర్చున్న వానరం ఆ అద్దంలో తనని తాను చూసుకొని, ఇంకో వానరం ఏదో అందులో ఉంది అనుకుంది. ఆ అద్దాన్ని వెనక్కి ముందుకి తిప్పి తిప్పి చూసింది.. పైకి ఎత్తింది… కిందకు పెట్టింది..ఎలా చేసినా అందులోనుంచి కోతి మాత్రం బయటకు రావట్లేదు. ఇది నాకంటే అందంగా ఉంది.. దీన్ని ఎలాగైనా ఇక్కడినుంచి తరిమేయాలనుకుంది.. కానీ అద్దంలో ఉన్నది తన ప్రతిబింబమే అని తెలియని కోతి.. ఇది ఎంతకీ మనచేతికి చిక్కడంలేదు.. ఎందుకొచ్చిన గొడవ.. మనమే వెళ్లిపోతే పోలా.. అనుకొని అద్దాన్ని పక్కన పడేసి అక్కడినుంచి వెళ్లిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై తిరుమల తిరుపతిలో ఉచితంగా
కూలీలు పని చేస్తుండగా పొదల్లో ఏవో కదలికలు.. ఏంటా అని చూడగా
పర్యాటకులను ఆకర్షించిన సింహాల జంట.. వీరూ మరణంతో ఒంటరైన జై..!
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

