AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై తిరుమల తిరుపతిలో ఉచితంగా

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై తిరుమల తిరుపతిలో ఉచితంగా

Phani CH
|

Updated on: Jun 19, 2025 | 7:10 PM

Share

శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ప్రైవేట్ వాహనాల ఛార్జీల దోపిడీని అరికట్టడానికి, తిరుమల భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఈవో శ్యామలరావు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమలలో భక్తులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించేందుకు ఇకపై ఆర్టీసీ బస్సుల్లో ఉచితంంగా ప్రయాణం చేసే వీలుని కల్పించనున్నామని చెప్పారు.

గత కొంత కాలంగా భక్తుల నుంచి ప్రైవేట్ వాహనదారులు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని అనేక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని.. ఈ దోపిడీని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఈ చర్యల వలన రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం, ప్రైవేట్ రవాణా నిర్వాహకులు అధిక ఛార్జీలను అరికట్టవచ్చునని భావిస్తున్నామని చెప్పారు. తిరుపతి -తిరుమల మధ్య తిరిగే బస్సులతో పాటు.. తిరుమలలోని ఇతర ముఖ్య ప్రాంతాలకు వెళ్లాలనుకునే భక్తులకు ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నామని చెప్పారు. ఇప్పటికే ఈ విషయంపై ఆర్టీసీ అధికారులతో మాట్లాడినట్లు.. ఈ సేవలను ఉచితంగా అందించడానికి ఆర్టీసీ అధికారులు ఓకే చెప్పారని తెలిపారు. ఈ సేవల్లో భాగంగా మొదటి దశలో దాదాపు 150 బస్సులు అందుబాటులోకి వస్తాయి అన్నారు. టిటిడి ఇప్పటికే ఉచిత సేవలను అందించే పరిమిత సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతోంది. ఎపిఎస్‌ఆర్‌టిసి బస్సులను చేర్చడం వల్ల ప్రైవేట్ టాక్సీలపై ఆధారపడటం గణనీయంగా తగ్గుతుందని భావిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కూలీలు పని చేస్తుండగా పొదల్లో ఏవో కదలికలు.. ఏంటా అని చూడగా

పర్యాటకులను ఆకర్షించిన సింహాల జంట.. వీరూ మరణంతో ఒంటరైన జై..!

మీలో ఈ లక్షణాలు ఉంటే.. డి విటమిన్‌ లోపమే కారణం

మనిషి క్రూరత్వం.. పిల్లిని 9వ అంతస్తు నుంచి విసిరేసాడు

కొత్త ఫ్లాట్‌లు కొనే వారికి అలర్ట్.. ఈ చిన్న లాజిక్ మిస్ అయితే మీ కొంప కొల్లేరే..!