Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూలీలు పని చేస్తుండగా పొదల్లో ఏవో కదలికలు.. ఏంటా అని చూడగా

కూలీలు పని చేస్తుండగా పొదల్లో ఏవో కదలికలు.. ఏంటా అని చూడగా

Phani CH
|

Updated on: Jun 19, 2025 | 7:07 PM

Share

విజయనగరం జిల్లా గంట్యాడ మండలానికి చెందిన పెణసాంలో ఓ భయానక ఘటన చోటుచేసుకుంది. గ్రామ శివారులోని నేరేడు చెరువులో ఉపాధి హామీ పథకం కింద కూలీలు పనిచేస్తుండగా ఓ భారీ కొండచిలువ పొదల మధ్య నుంచి అకస్మాత్తుగా కూలీల పైకి దూసుకొచ్చింది. సుమారు 12 అడుగుల పొడవుతో, బలంగా, భయానకంగా ఉన్న కొండచిలువను చూసి అక్కడున్నవారు భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు.

కొంతసేపటి తరువాత కొంత మంది యువకులు ధైర్యం తెచ్చుకొని కర్రల సహాయంతో కొండచిలువను చుట్టుముట్టి దాడికి ప్రయత్నించారు. గమనించిన కొండచిలువ వారి పై ప్రతిఘటించే ప్రయత్నం చేసింది. అలా కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎట్టకేలకు గ్రామస్థులంతా కలిసి కొండచిలువను హతమార్చారు. కొండచిలువ మృతి చెందడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే అలాంటి భారీ కొండచిలువను గ్రామస్తులు గతంలో ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. అడవికి సమీపంగా ఉన్న ప్రాంతం కావడంతో అప్పుడప్పుడు చిన్నపాటి పాములు కనిపించడం సహజమే కానీ, ఈ స్థాయిలోని పాము రావడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం తమకు కనిపించిన కొండచిలువ గ్రామంలో సంచరిస్తే చిన్న పిల్లలకు, పశువులకు ప్రమాదం కలగవచ్చని భావించి హతమార్చినట్లు చెప్తున్నారు. ఈ ఘటన పై పర్యావరణ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్థులకు పాముల ప్రవర్తన, వాటి ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడతామని పర్యావరణవేత్తలు అంటున్నారు. మరోవైపు కొండచిలువలు సాధారణంగా మనుషులపై దాడికి దిగవని, ఆకలితో తిండిని వెతుకుతూ వస్తాయని అంటున్నారు స్నేక్ క్యాచర్స్. ఎవరికైనా పాములు కనిపిస్తే వాటిని చంపవద్దని తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే వాటిని పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలేస్తామని అంటున్నారు . పర్యావరణ సమతుల్యత కోసం పాములు ఉండాలని, వాటిని మనం ప్రేమించాలని అంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పర్యాటకులను ఆకర్షించిన సింహాల జంట.. వీరూ మరణంతో ఒంటరైన జై..!

మీలో ఈ లక్షణాలు ఉంటే.. డి విటమిన్‌ లోపమే కారణం

మనిషి క్రూరత్వం.. పిల్లిని 9వ అంతస్తు నుంచి విసిరేసాడు

కొత్త ఫ్లాట్‌లు కొనే వారికి అలర్ట్.. ఈ చిన్న లాజిక్ మిస్ అయితే మీ కొంప కొల్లేరే..!

స్నేక్ క్యాచర్ ను చూసి హడలెత్తిపోయిన కోడెనాగు.. ఏం చేసిందో తెలుసా..?