స్నేక్ క్యాచర్ ను చూసి హడలెత్తిపోయిన కోడెనాగు.. ఏం చేసిందో తెలుసా..?
వర్షాకాలంలో పాములు ఎక్కువగా బయట సంచరిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే జనావాసాల్లోకి వస్తూ.. కార్లు, బైకులు, ఏసీలు ఒకటేమిటి ఎక్కడపడితే అక్కడ తిష్ట వేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తాయి. పాముల వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యకరంగా ఉంటే, మరికొన్ని వీడియోలు చూస్తే విడ్డూరంగా ఉంటాయి.
ప్రస్తుతం స్నేక్ క్యాచర్‌ను చూసి భయపడిన ఓ కోడెనాగుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రకారం ఓ ఇంటి ఆవరణలోకి ఓ నాగుపాము వచ్చింది. ఆ ఇంటివారు దానిని గమనించి స్థానిక స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ పామును పట్టుకునే ప్రయత్నంలో దాని దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అంతే స్నేక్ క్యాచర్‌ను గమనించిన ఆ కోడెనాగుకు సీన్ అర్ధమైంది. తన పని అయిపోయింది అనుకొని భయపడిపోయి.. పడగవిప్పి బిత్తర చూపులు చూస్తూ అక్కడి నుంచి తప్పించుకునేందుకు తెగ ప్రయత్నించింది. పాము మెల్లగా వెనకకు పాకుతూ వెళ్లేందుకు ప్రయత్నించింది. జారుకుంటున్నట్లు వెనక వైపున వెళ్లింది. పాము పరిస్థితిని అర్ధం చేసుకున్న స్నేక్ క్యాచర్ జాగ్రత్తగా దానిని పట్టుకొని తీసుకెళ్లి అడవిలో వదిలేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:

ఇదేం వింత సంప్రదాయం.. అక్కడ ప్రతీ పురుషుడికీ ఇద్దరు భార్యలు!

వందేళ్ల ప్రయాణం ముగిసింది.. వైరల్ వీడియో

ప్లాస్టిక్‌ను తినేస్తున్న పురుగులు..వైరల్ వీడియో

ఇది పొగ లేని సిగరెట్ కానీ దీనిని పీల్చరు.. తాగుతారు వీడియో

కుక్కను పెంచుకోవడానికి .. మీ ఇరుగు పొరుగు పర్మిషన్ తప్పనిసరి!

గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మి వెళ్తుండగా.. గుంతలో పడ్డ కారు

బద్ధలవుతున్న అగ్నిపర్వతం సాక్షిగా.. జంట నిశ్చితార్థం
