వీధుల్లో జీబ్రా పరుగులు .. పట్టుకున్న విధానంలో ట్విస్ట్!
వీధుల్లో పరుగులు పెడుతూ హల్ చల్ సృష్టించిన జీబ్రా చివరికి అధికారులకు దొరికింది. గత వారం రోజులుగా కంటిమీద కునుకు లేకుండా చేసిన జీబ్రా కథ సుఖాంతం కావడంతో అంతా ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. అసలేం జరిగిందంటే? అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రం క్రిస్టియానా ప్రాంతానికి చెందిన లారా ఫోర్డ్ అనే వ్యక్తి ఎడ్ అనే జీబ్రాను పెంచుకుంటున్నాడు. అయితే, ఓ రోజు ఈ జీబ్రా సడెన్‌గా అతని ఫార్మ్‌హౌస్ నుంచి పారిపోయి, రోడ్లపై కలకలం రేపింది.
రోడ్లపై జీబ్రా పరుగులు పెట్టడం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయటంతో వైరల్‌గా మారాయి. ఈ విషయంపై జీబ్రా యజమాని అధికారులకు ఫిర్యాదు చేయటంతో సీసీ కెమెరాల ఆధారంగా దానిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. వారం రోజులుగా దాని కోసం గాలిస్తుండగా.. చివరికి ఆదివారం రోజున అధికారులకు చిక్కింది. అయితే ఇక్కడ జీబ్రాను పట్టుకునే విధానమే అసలైన ట్విస్ట్.. ఓ భారీ నెట్‌లో దాన్ని వేసి, హెలికాప్టర్‌తో గాల్లోకి ఎత్తి యజమాని వద్దకు తరలించారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు.. ‘తల బయట పెట్టి జీబ్రా బాధగా కనిపిస్తుంది’ అంటూ కొందరు, ‘మొత్తానికి క్షేమంగా దొరికింది’ అంటూ మరికొందరు భావోద్వేగంతో కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
విందులో మందు లేదని కుటుంబాన్ని వెలేసిన గ్రామస్తులు వీడియో
జగిత్యాలలో ఎల్లో ఫ్రాగ్స్ కలకలం దేనికి సంకేతమో తెలుసా?వీడియో
వీడు మామూలోడు కాదు.. ప్రియురాలి కోసం.. వీడియో
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో

