విందులో మందు లేదని కుటుంబాన్ని వెలేసిన గ్రామస్తులు వీడియో
మద్యం విందు ఇయ్యనందుకు ఓ కుటుంబాన్ని వెలి వేసిన ఘటన ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో చోటు చేసుకుంది. అసలే ఇంటి పెద్ద చనిపోయి పుట్టెటు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాన్ని మరింత బాధలోకి నెట్టేశారు. ఓ గిరిజన కుటుంబంలో వృద్దుడు ఇటీవల కాలం చేయడంతో ఊరంతా కలిసి అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విందులో సాంప్రదాయ మద్యం ‘హండియా’ పోయ్యలేదనే కారణంతో ఆ గిరిజన కుటుంబాన్ని బహిష్కరించారు. ఈ సంఘటన శరత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశపద గ్రామంలో జరిగింది.
అక్కడ సంతాల్ తెగకు చెందిన 67 ఏళ్ల రామ్ సోరెన్ మార్చి 27న మరణించాడు. ఒక నెల తర్వాత, అతని కుమారుడు సంగ్రామ్ సోరెన్ సంప్రదాయం ప్రకారం విందు ఏర్పాటు చేశాడు. కానీ అతను అందులో హండియా ఏర్పాటు చేయలేదు. తన తండ్రి మద్యపాన వ్యసనం కారణంగా మరణించాడని, కాబట్టి అతను తన విందులో హండియా పోయలేదని సంగ్రామ్ చెబుతున్నాడు. అయితే గ్రామస్థులు మాత్రం అతని నిర్ణయాన్ని తప్పుబట్టారు. హండియా పోయలేదనే కారణంగానే గ్రామస్తులు సంగ్రామ్, అతని భార్య లచ్చా, ముగ్గురు పిల్లలను సామాజికంగా బహిష్కరించారు. ఆ కుటుంబం గ్రామంలోని చెరువులో నుంచి గానీ, బావిలో నుంచి గానీ తాగు నీరు తీసుకోవడానికి అనుమతి లేదు. ఆ కుటుంబానికి దుకాణదారులు వస్తువులు విక్రయించకూడదని ఆదేశించారు. గ్రామస్తులు తమతో మాట్లాడరని లేదా ఎటువంటి పని ఇవ్వడం లేదని లచ్చా ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గ్రామస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. సామాజికంగా బహిష్కరించడం నేరమని వివరించారు. పరస్పర చర్చల ద్వారా ఈ విషయాన్ని పరిష్కరించుకోవాలని పోలీసులు సూచించారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఆసక్తికరంగా శాంతల్ కమ్యూనిటీకి చెందిన ఒక పూజారి కూడా ఈ విందులో హండియా వడ్డించడం మతపరమైన బలవంతం కాదని, కానీ అది కుటుంబం కోరిక, ఆర్థిక స్థితిపై ఆధారపడి ఉంటుందని అంగీకరించారు. హండియాను ఒడిశా, జార్ఖండ్, బెంగాల్ గిరిజన సమాజంలో సాంప్రదాయ పానీయంగా పిలుస్తారు.
మరిన్నివీడియోల కోసం :
ఎప్పుడో తండ్రి చేసిన పనికి.. కొడుకు పంట పండింది వీడియో
రన్నింగ్ ట్రైన్‌లో సెల్పీ తీసుకుంటున్న యువకుడు…అంతలో వీడియో
కొత్త జంటకు ప్రధాని నుంచి ఊహించని కానుక వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
