Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పర్యాటకులను ఆకర్షించిన సింహాల జంట.. వీరూ మరణంతో ఒంటరైన జై..!

పర్యాటకులను ఆకర్షించిన సింహాల జంట.. వీరూ మరణంతో ఒంటరైన జై..!

Phani CH
|

Updated on: Jun 19, 2025 | 7:08 PM

Share

గుజరాత్‌లోని గిర్ అడవిలో విషాదకర సంఘటన జరిగింది. గిర్‌ అడవుల్లో ఎంతో ప్రసిద్ధమైన సింహాల జంట 'జై-వీరూ'లో ఒకటైన వీరూ జూన్ 10న మరణించింది. బాలీవుడ్ క్లాసిక్ 'షోలే'లోని పాత్రల పేర్లు పెట్టబడిన ఈ ఐకానిక్ సింహాల జంట ఎనిమిదేళ్లకు పైగా గిర్ అడవిలోనే జీవిస్తున్నాయి. గిర్ ఈస్ట్ డివిజన్‌లోని తులసిష్యం రేంజ్‌లో తరచూ ఈ సింహాల జంట కనిపించేది.

తాజాగా ఆ జంటలో ఒకటైన వీరూ అనే సింహం మృతి చెందింది. వీరూకు దాదాపు పదేళ్ల వయస్సు ఉంటుంది. ఈ రెండు సింహాలపైన రెండు వేర్వేరు మగ సింహాల గుంపులు దాడి చేయడంతో అవి తీవ్రంగా గాయపడ్డాయని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. కాసియా ప్రాంతానికి చెందిన మగ సింహాల గుంపు మొదట జై పైన దాడి చేసాయని, ఈ క్రమంలో జై వెనుక భాగంలో తీవ్రంగా గాయాలయ్యాయని చికిత్స చేయిస్తున్నట్టు అధికారి వివరించారు. దీంతో ఒంటరిగా మిగిలిన వీరూపై ఖోకర్‌ వైపునుంచి వచ్చిన మరో మగ సింహాల గుంపు దాడికి పాల్పడింది. ఈ దాడిలో వీరూ తీవ్రంగా గాయపడింది. నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్న వీరూ మంగళవారం నుంచి ఆహారం తీసుకోవడం మానేసింది. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున వీరూ మరణించినట్టు వెల్లడించారు. గిర్‌ అడవుల్లో జై, వీరూ ఎప్పుడూ జంటగా తిరుగుతూ ఉండేవి. ఐదేళ్లుగా ఈ సింహాలు రెండూ ఎంతో స్నేహంగా ఉంటున్నాయి. ఎప్పుడూ ఒంటరిగా కనిపించని ఈ సింహాలు తమ ప్రాంతానికి వచ్చే ఇతర సింహాలను తరిమి కొట్టేవి. ఒకటి లేకుండా ఇంకొకటి ఎప్పుడూ బయటకు వెళ్లేవి కాదు. జే-వీరూ ఈ టూరిజం జోన్‌లో దాదాపు సగం ప్రాంతపై ఆధిపత్యం చెలాయించాయి. అయితే, ఈ రెండూ గత రెండు నెలలుగా గట్టి పోటీని ఎదుర్కొంటున్నాయని, అయినా.. ఇతర సింహాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడుతూ వాటిని తరిమికొట్టాయని, వీరూ మరణంతో జై ఒంటరిగా మిగిలిపోయాడని మరొక అధికారి తెలిపారు. డిపార్ట్‌మెంట్‌లోని అందరూ ఈ సింహాల జంటను ఎప్పటికీ గుర్తుంచుకుంటారని బీట్ గార్డ్ అన్నారు. ఈ సింహాల జంట గురించి తెలిసిన వారంతా సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ తమ విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మీలో ఈ లక్షణాలు ఉంటే.. డి విటమిన్‌ లోపమే కారణం

మనిషి క్రూరత్వం.. పిల్లిని 9వ అంతస్తు నుంచి విసిరేసాడు

కొత్త ఫ్లాట్‌లు కొనే వారికి అలర్ట్.. ఈ చిన్న లాజిక్ మిస్ అయితే మీ కొంప కొల్లేరే..!

స్నేక్ క్యాచర్ ను చూసి హడలెత్తిపోయిన కోడెనాగు.. ఏం చేసిందో తెలుసా..?

మాల్‌లో కుక్కను తెచ్చిన అమ్మాయి.. కుక్కను చూసి జనం షాక్‌

Published on: Jun 19, 2025 07:04 PM