Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీలో ఈ లక్షణాలు ఉంటే.. డి విటమిన్‌ లోపమే కారణం

మీలో ఈ లక్షణాలు ఉంటే.. డి విటమిన్‌ లోపమే కారణం

Phani CH
|

Updated on: Jun 19, 2025 | 6:46 PM

Share

శరీరానికి అత్యంత అవసరమైన పోషకాల్లో ‘విటమిన్ డి’ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నలుగురు పెద్దల్లో ఒకరు ఈ ‘విటమిన్ డి’ లోపంతో బాధపడుతున్నారట. ఈ పోషకం లోపిస్తే తీవ్రమైన అలసట, మానసిక కుంగుబాటు లక్షణాలు, ఎముకల సమస్యలతో ఇబ్బంది పడతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొన్ని కీలకమైన సంకేతాలు, లక్షణాలను గమనించడం ద్వారా ‘విటమిన్ డి’ లోపాన్ని గుర్తించవచ్చని చెబుతున్నారు.

జుట్టు విపరీతంగా రాలడం అనేది డి విటమిన్‌ లోపానికి ఒక ప్రధాన సంకేతం. విటమిన్ డి లోపం.. వెంట్రుకల పెరుగుదల చక్రాన్ని దెబ్బతీయడమే కాకుండా, జుట్టు పెరుగుదలకు అవసరమైన కెరాటినోసైట్‌ల పనితీరును ప్రభావితం చేస్తుంది. అలాగే, నడుం నొప్పి కూడా డి విటమిన్‌ లోపించింది అనడానికి మరో ముఖ్య లక్షణం. ‘విటమిన్ డి’ లోపం వీపు, మెడ, నడుము కండరాల బలహీనతకు దారితీస్తుంది. ఈ బలహీనత కండరాలపై ఒత్తిడి పెంచి నొప్పికి కారణమవుతుంది. ఆరోగ్యంగా ఉన్నప్పటికీ నిరంతరం అలసటగా అనిపించడం కూడా ‘విటమిన్ డి’ లోపానికి సూచనే. శరీరంలోని కణాల జీవక్రియకు, శక్తి ఉత్పత్తికి ‘విటమిన్ డి’ అవసరం. ఇది తక్కువగా ఉన్నప్పుడు, ఎంత బాగా నిద్రపోయినా, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించినా నీరసంగా అనిపిస్తుంది. తక్కువ ‘విటమిన్ డి’ స్థాయిలు ఆందోళన లక్షణాలను కూడా పెంచుతాయి. మెదడు, నాడీ వ్యవస్థ ఆరోగ్యానికి ‘విటమిన్ డి’ చాలా ముఖ్యం. అంతేకాకుండా, ఆకలి మందగించడం, కుంగుబాటు, నిద్ర సరిగా పట్టకపోవడం, గాయాలు నెమ్మదిగా మానడం వంటివి కూడా ‘విటమిన్ డి’ లోపం వల్ల కలిగే ఇతర లక్షణాలు. ఈ లక్షణాలు మీలో కనిపిస్తే, వెంటనే వైద్యులను సంప్రదించి రక్త పరీక్ష ద్వారా ‘విటమిన్ డి’ స్థాయిలను తెలుసుకోవడం ఉత్తమం. లోపం ఉన్నట్లు తేలితే, వైద్యుల సూచన మేరకు చికిత్స తీసుకోవాలి. విటమిన్‌ డి లోపాన్ని అధిగమించడానికి సాల్మన్, ట్యూనా వంటి కొవ్వు ఎక్కువగా ఉండే చేపలు, గుడ్డు సొన, పాలు, బాదం పాలు, సోయా పాలు, ఆరెంజ్ జ్యూస్, ఓట్ మీల్ వంటివి ఆహారాలతో పాటు, ప్రతిరోజూ కనీసం 15 నిమిషాలు ఉదయం సూర్యరశ్మిలో ఉండటం వల్ల శరీరం తనకు తానుగా ‘విటమిన్ డి’ని ఉత్పత్తి చేసుకుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మనిషి క్రూరత్వం.. పిల్లిని 9వ అంతస్తు నుంచి విసిరేసాడు

కొత్త ఫ్లాట్‌లు కొనే వారికి అలర్ట్.. ఈ చిన్న లాజిక్ మిస్ అయితే మీ కొంప కొల్లేరే..!

స్నేక్ క్యాచర్ ను చూసి హడలెత్తిపోయిన కోడెనాగు.. ఏం చేసిందో తెలుసా..?

మాల్‌లో కుక్కను తెచ్చిన అమ్మాయి.. కుక్కను చూసి జనం షాక్‌