Viral Video: పేరుకే బుడ్డోడు.. బౌలింగ్‌లో మాత్రం కాదు.. తన స్పిన్‌‌తో బ్యాట్స్‌మెన్‌ను ఎలా భయపెట్టాడో చూడండి..!

ప్రస్తుతం ఓ బుడ్డోడి వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. తన బౌలింగ్‌తో ఆకట్టుకుంటూ నెటిజన్లను ఫిదా చేస్తున్నాడు.

Viral Video: పేరుకే బుడ్డోడు.. బౌలింగ్‌లో మాత్రం కాదు.. తన స్పిన్‌‌తో బ్యాట్స్‌మెన్‌ను ఎలా భయపెట్టాడో చూడండి..!
Boy Spin Bowling Viral Video

Updated on: Nov 17, 2021 | 3:11 PM

Trending Video: ప్రస్తుతం క్రికెట్ ప్రపంచ వ్యాప్తంగా మార్మోమ్రోగిపోతోంది. ఎక్కడ చూసిన బ్యాట్, బాల్ పట్టుకుని కనిపించే జనాలే కనిపిస్తున్నారు. ఇలాంటి గల్లీ మ్యాచుల్లోనూ భలే సరదా యాక్షన్‌లను మనం నెట్టింట్లో చూస్తూనే ఉన్నాం. కొన్ని క్రికెట్ వీడియోలు ఆకట్టుకుంటే, మరికొన్ని మాత్రం షాకిస్తుంటాయి. ప్రస్తుతం ఓ బుడ్డోడి వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. తన బౌలింగ్‌తో ఆకట్టుకుంటూ నెటిజన్లను మాయ చేస్తున్నాడు. తన బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్లను భయబ్రాంతులకు గురిచేయడంతో సోషల్ మీడియాలో ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు.

india_fans_club_777s అకౌంట్‌లో ‘ఈ బాలుడి బౌలింగ్ యాక్షన్‌ను చూడండి’ అంటూ ఈ వీడియోను పంచుకున్నారు. నవంబర్ 3న అప్‌లోడ్ చేసిన ఈ వీడియో 40 లక్షలకు పైగా లైక్స్‌తో నెట్టింట్లో దూసుకపోతోందంటే కారణం మాత్రం ఈ బుడ్డోడే. తన స్పిన్ బౌలింగ్‌తో మాయ చేసి క్రీజులో ఉన్న బ్యాట్స్‌మెన్‌ను భయపెట్టేలా బౌలింగ్ చేయడమే కాకుండా.. ఆ బ్యాట్స్‌మెన్ ఏకంగా క్రీజు వదిలేలా చేశాడు. దీంతో నెటిజన్లు ఈ బాలుడి బౌలింగ్‌ను మెచ్చి కామెంట్లు కూడా చేస్తున్నారు. రషీద్ ఖాన్‌ను అచ్చం దింపేశాడని కొందరంటే, షేన్ వార్న్ కంటే గొప్పవాడవుతాడని మరికొందరు తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఏదో ఒక రోజు టీమిండియాలో నిన్ను తప్పకుండా చూస్తామని కూడా కామెంట్లు చేశారు.

Also Read: Viral Video: పామును వేటాడిన చేప.. వీడియో చూసి నెటిజన్ల షాక్.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో..

Viral Video: ‘వీడికి ఒక్కసారే దెయ్యం పట్టిందా ఏంటి..?’.. నవ వధువుపై విరుచుకుపడ్డాడు