కాలు నొప్పిగా ఉంది.. వైద్యం చేయమని అడిగిన వీధి కుక్క.. వీడియో వైరల్‌

Updated on: Nov 10, 2025 | 2:51 PM

ఒక వీధి కుక్క తన కాలినొప్పితో బాధపడుతూ నేరుగా వెటర్నరీ ఆసుపత్రికి వెళ్లి సహాయం కోరింది. ఈ అద్భుతమైన దృశ్యం సీసీటీవీలో రికార్డ్ అయి వైరల్ అయింది. కుక్కల తెలివి, వాటి ప్రత్యేక లక్షణాలు, మనుషుల కంటే మెరుగైన వాసన, వినికిడి శక్తి, అపారమైన విశ్వాసం గురించి ఈ వ్యాసం వివరిస్తుంది. మనుషుల్లోనే కాదు జంతువులకూ బోలెడన్ని కష్టాలుంటాయి.

మనుషుల్లోనే కాదు జంతువులకూ బోలెడన్ని కష్టాలుంటాయి. చెప్పలేనంత తెలివి, నోరు లేకపోయినా తమ బాధను ఎదుటి వారికి వ్యక్తపరచగల ప్రతిభ కూడా ఈ మూగ జీవులకు ఉంటుంది. ఆయా సందర్భాలను బట్టి, అవసరాలను బట్టి జంతువులు చాలా ఓర్పును, నేర్పును ప్రదర్శిస్తాయి. అలా ప్రదర్శించే జంతువులలో కుక్క ముందు వరసలో ఉంటుంది. సాధారణంగా జంతువులేవీ తమ బాధలను బయటకు చెప్పుకోలేవు. శారీరకంగా ఎంత కష్టం వచ్చినా, దెబ్బలు తగిలినా తమలో తామే బాధపడతాయి. నొప్పితో విలవిలలాడతాయి తప్ప చికిత్స గురించి ఆలోచించవు. కానీ, ఆశ్చర్యంగా ఓ వీధి కుక్క కాలినొప్పితో బాధపడుతూ హాస్పిటల్‌కు వెళ్లింది. హాస్పిటల్‌లో అమర్చిన సీసీటీవీ లో ఆ విజువల్‌ రికార్డు అయింది. ఆ కుక్క నేరుగా వెటర్నరీ హాస్పిటల్ దగ్గరకు వచ్చి అక్కడున్న వారి ముందు కూర్చుని గాయమైన తన కాలిని ముందుకు చాచి సహాయం కోసం అర్థించింది. అక్కడున్న వైద్యురాలు ఆ కుక్కను పరీక్షించి చికిత్స కోసం లోపలికి తీసుకెళ్లారు ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 90 వేల మంది చూసారు. ఆ కుక్క చాలా తెలివైదని చాలా మంది కామెంట్లు చేశారు. మనుషుల కంటే ఈ కుక్క ఎక్కువ తెలివి ప్రదర్శించిందని మరొకరు కామెంట్‌ చేసారు. ఈ క్రమంలో కుక్కలకు ఉండే అనేక లక్షణాల మీదా చర్చ జరుగుతోంది. కొన్ని కుక్కలు మనిషి కంటే 40 రెట్లు ఖచ్చితంగా వాసనను గుర్తిస్తాయట. అలాగే.. వినికిడి శక్తి కూడా మనిషి కంటే వాటికి చాలా ఎక్కువ.మనలాగే వాటికి కూడా కుడి చేయి వాటం, ఎడమ చేయి వాటం ఉంటాయి. వాటికి ఇష్టమైన వస్తువు ఇచ్చినప్పుడు ఈ విషయాన్ని గమనించచ్చు. మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని వాసన ద్వారా పసిగట్టి, లెవెల్స్ తగ్గినా లేదా పెరిగినా సంజ్ఞల ద్వారా అవి చెబుతాయట. అయితే.. ఆ టైంలో వాటిని ప్రసంశించకపోతే.. కొన్నాళ్లకు అలా చెప్పటమే మానేస్తాయట. ఇక.. అన్నింటి కంటే ముఖ్యమైన లక్షణం విశ్వాసం. అందుకే యాజమానులు వాటిని కన్నబిడ్డల్లా చూసుకుంటారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆటోలో నగల బ్యాగ్‌.. డ్రైవర్‌ ఏం చేశాడంటే

వామ్మో.. కొండచిలువను ఓ ఆటాడుకున్న యువతి

Pawan Kalyan: కాలినడకన అడవిలో పవన్ టూర్‌

40 వృద్ధ జంటలకు సొంత ఖర్చుతో రెండోసారి పెళ్లి చేసిన పూజారి

USA: ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్ళి మృత్యువాత

Published on: Nov 10, 2025 02:48 PM