Viral Video: ఆనందంతో గుర్రమెక్కి చిందులేశాడు.. పట్టుతప్పి వరుడుకి కూడా షాక్ ఇచ్చాడు.. నెట్టింట్లో నవ్వులు పూయిస్తున్న వీడియో

|

Oct 07, 2021 | 3:05 PM

పెళ్లి వీడియోలు నెట్టింట్లో ఎల్లప్పుడూ సందడి చేస్తుంటాయి. యూజర్లకు కూడా ఇలాంటిహవా ఎక్కువగా ఉంటుంది. తాజాగా ఓ వ్యక్తి చేసిన ఓ పని నెట్టింట్లో నవ్వులు పంచుతోంది.

Viral Video: ఆనందంతో గుర్రమెక్కి చిందులేశాడు.. పట్టుతప్పి వరుడుకి కూడా షాక్ ఇచ్చాడు.. నెట్టింట్లో నవ్వులు పూయిస్తున్న వీడియో
Groom Viral Video
Follow us on

Viral Video: ప్రతి ఒక్కరూ పెళ్లి సందర్భంగా చాలా సరదాగా ఉంటారు. అయితే ఈ టైంలో కొందరు చేసే పనుల వల్ల సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తుంటారు. పెళ్లిళ్లలో సరదా వీడియోలు ఎన్నో నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. తాజాగా అలాంటి ఓవీడియోనే సోషల్ మీడియాలో వైరల్‎‌గా మారింది. ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు నవ్వుల్లో మునిగిపోతున్నారు. పెళ్లి కుమారుడిని ఓ గుర్రంపై ఊరేగిస్తున్నారు. అంతలో ఓ వ్యక్తి ఆనందంలో గుర్రమెక్కి నోట్లను జనాలపైకి చల్లడం ప్రారంభించాడు. ఆ తరువాత జరిగిన పరిణామంతో చుట్టు ఉన్నవాళ్లనే కాదు.. సోషల్ మీడియాలో నవ్వులు పూయించేలా చేసింది.

ఈ వీడియోలో వరుడు చాలా సంతోషంగా ఉన్నట్లు చూడవచ్చు. అదే సమయంలో పెద్ద సంఖ్యలో ప్రజలు అతని చుట్టూ నిలబడి ఉన్నారు. కానీ, ఈలోగా, అకస్మాత్తుగా ఒక వ్యక్తి పెళ్లి కుమారుడు ఉన్న గుర్రంపైకి ఎక్కాడు. అనంతరం సదరు వ్యక్తి గుర్రంపైనే డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. పనిలో పనిగా తన జేబులో నుంచి డబ్బులు తీసి జనాలపైకి విసరడం ప్రారంభించాడు. అంతా బాగుంది అనుకున్న సమయంలో అతని డ్యాన్స్ మూమెంట్స్‌లో పట్టు తప్పింది. దీంతో ఆ వ్యక్తితో పాటు వరుడు కూడా కిందపడిపోయాడు. దీంతో చుట్టుపక్కల ఉన్నవాళ్లే నవ్వులు చిందించడం చూడొచ్చు.

ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో ఇన్‌స్టా‌గ్రామ్‌లో ‘horse_of_kathiyawad1’ పేరుతో షేర్ చేశారు. ఈ అద్భుతమైన వీడియోను ఇప్పటివరకు లక్షలాది మంది వీక్షించారు. 96 వేలకు పైగా ప్రజలు ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.


Also Read: Viral Video: ఇతని జీవితం అందరికి స్పూర్తిదాయకం.. కళ్లు లేకున్నా స్వయం ఉపాధితో అందరికి ఆదర్శంగా..

Covid patient: హృదయ విదారకం.. కళ్లెదుటే కన్నతల్లి మృతి.. కాపాడుకునేందుకు కూతురు, కొడుకు..