Viral Video: రైలులో ప్రయాణం అందరికీ ఎంతో నచ్చుతుంది. చాలామంది ప్రజలు ప్లేయిన్ లేదా రహదారి కంటే ఎక్కువగా రైలులో ప్రయాణించడానికి ఇష్టపడుతుంటారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంటర్నెట్‌లో రైళ్ల వీడియోలు ఎన్నో వైరల్‌గా మారాయి. తాజాగా ఓ వీడియో కూడా అలాంటి కోవలోకే వస్తోంది. నాలుగు రైళ్లు ఒకే దిశలో ఒకేసారి నడుస్తున్నట్లు కనిపిస్తాయి. దీంతో ఎక్కువ మంది నెటిజన్లు ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ 45-సెకన్ల వీడియో బాగా వైరల్‌గా మారుతోంది. ఈ వీడియోను ఐపీఎస్ రూపిన్ శర్మ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. వీడియోను పంచుకుంటూ – నాలుగు రైళ్లు ఒకే దిశలో కలిసి నడుస్తున్న అరుదైన వీడియో అంటూ రాసుకొచ్చాడు.
ఇంటర్నెట్ ప్రపంచంలో కూడా ప్రజలు ఈ వీడియోను చాలా ఇష్టపడుతున్నారు. ఆవిరి ఇంజిన్ రైళ్లు ఒకే మార్గంలో నాలుగు ట్రాక్‌లపై నడుస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఈ రైలు నాలుగు ట్రాక్‌లపై ఒకే దిశలో రావడం చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఈ వీడియోలో సమీపంలోని ప్లాట్‌ఫారమ్‌పై నిలబడి ఉన్న ఎంతో మంది ఈ అరుదైన దృశ్యాన్ని తమ కెమెరాల్లో బంధిస్తున్నట్లు చూడవచ్చు.
ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ అయిన వెంటనే నెటిజన్లు కామెంట్లతో సందడి చేస్తున్నారు. ఈ దృశ్యం నాకు ఆస్ట్రేలియాలో నిర్వహించే ఆవిరి రైలు రేసులా అనిపిస్తుంది.. దీనిని మైట్‌ల్యాండ్ / హంటర్ వ్యాలీ స్టీమ్‌ఫెస్ట్ అని పిలుస్తారంటూ రాసుకొచ్చారు. అదే సమయంలో- మూడు రైళ్లు ఒకే స్టేషన్‌లో ఆగకూడదని మరొకరు కామెంట్ చేశారు. మరికొందరు అద్భుతం అంటూ కామెంట్లు చేశారు.
Rare video of #four #Trains moving in the #SameDirection.
Rare by any standards.?@rpfcr @ipsvijrk @hvgoenka pic.twitter.com/WvLxQz5a11
— Rupin Sharma IPS (@rupin1992) September 9, 2021
Also Read:
Robbery Video: పెద్ద పెద్ద కత్తులతో వచ్చారు.. క్షణాల్లో దోచుకెళ్లారు.. వైరల్ వీడియో
యూపీకి చెందిన 15 ఏళ్ల బాలిక చేసిన సాహస యాత్ర.. దేనికోసమో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. వీడియో