Viral Video: సుశాంత్ మూవీ ‘నమో నమో శంకర’ సాంగ్‌కు ఏనుగు ఓ రేంజ్‌లో డ్యాన్స్.. వీడియో వైరల్

|

Apr 17, 2021 | 1:15 PM

శిశుర్వేత్తి.. పశుర్వేత్తి.. వేత్తి గాన రసం ఫణిః అన్నారు పెద్దలు. శిశువులు, పశువులు, పాములు సైతం సంగీతానికి తన్మయత్వం చెందుతాయని.. సంగీతాన్ని ఆస్వాదిస్తాయని..

Viral Video: సుశాంత్ మూవీ నమో నమో శంకర సాంగ్‌కు ఏనుగు ఓ రేంజ్‌లో డ్యాన్స్.. వీడియో వైరల్
Elephant Dance
Follow us on

Viral Video: శిశుర్వేత్తి.. పశుర్వేత్తి.. వేత్తి గాన రసం ఫణిః అన్నారు పెద్దలు. శిశువులు, పశువులు, పాములు సైతం సంగీతానికి తన్మయత్వం చెందుతాయని.. సంగీతాన్ని ఆస్వాదిస్తాయని అంటారు. ఈ మాటను నిజం చేస్తూ.. చాలా జంతువులు పాటలకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తున్న వీడియో లో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజా ఓ ఏనుగు శివుడికి పాటకు తనదైన స్టైల్ లో డ్యాన్స్ చేసింది. బాలీవుడ్ లోని సూపర్ హిట్ సాంగ్ ” నామో నామో జీ శంకర” పాట ప్లే అవుతుంటే.. ఏనుగు డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో చల్ చల్ చేస్తుంది.

ఈ వీడియోను కేరళ ఏనుగులు అనే పేరుతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఏనుగు తన పెద్ద పెద్ద చెవులను ఊపుతూ.. కాళ్ళను లయబద్ధంగా కలుపుతూ.. చేస్తున్న డ్యాన్స్ కు నెటిజన్లు ఫిదాఅయ్యారు. ఈ వీడియోతో పూర్తిగా ప్రేమలో పడిన నెటిజన్లు మీరు చాలా జంతువుల డ్యాన్స్ వీడియోలను చూసి ఉంటారు. అయితే అన్ని వీడియో లకంటే బిన్నం ఈ వీడియో.. లక్ష్మి అనే ఏనుగు శివ సాంగ్ కు చేస్తున్న డ్యాన్స్ ఖచ్చితంగా మిమ్మల్ని నవ్విస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ పాట దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరియు సారా అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన కేదార్‌నాథ్ చిత్రంలోనిది. ఈ లక్ష్మి ఏనుగు కర్ణాటకలోని కొడియాడ్కా ఆలయానికి చెందినదని తెలుస్తోంది.

Also Read:  తల తోక లేని వింతజంతువు అంటూ ఓ మహిళ హంగామా.. అసలు విషయం తెలిసాక నవ్వులే నవ్వులు

మనిషి జీవితమే ఈ చిదంబరం ఆలయం .. ఇక్కడ ఎన్నో రహస్యాలు.. అవన్నీ చిదంబర రహస్యమే..!