AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: స్టార్ ప్లేయర్ రోనాల్డోను ఇలా కూడా వాడేశారుగా..! నవ్వులు పూయిస్తున్న వైరల్ వీడియో

టిక్‌టాక్ యూజర్ ఒకరు క్రిస్టియానో ​రొనాల్డో - కోకాకోలా ఎపిసోడ్ పై ఓ వీడియోను రీ క్రియోట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ గా మారి నెటిజన్లను నవ్విస్తోంది.

Viral Video: స్టార్ ప్లేయర్ రోనాల్డోను ఇలా కూడా వాడేశారుగా..! నవ్వులు పూయిస్తున్న వైరల్ వీడియో
Cristiano Ronaldo Coca Cola Episode
Venkata Chari
|

Updated on: Jun 19, 2021 | 6:30 PM

Share

Cristiano Ronaldo – Coca Cola: స్టార్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో ​​రొనాల్డో ఈ వారమంతా ట్రెండింగ్‌లో ఉంటుంన్నాడు. ఓ మ్యాచ్ కు ముందు నిర్వహించిన సమావేశంలో మాట్లాడే ముందు.. కోకాకోలా బాటిళ్లను పక్కన పెట్టాడు. దీంతో ఈ స్టార్ ఆటగాడిపై సోషల్ మీడియాలో మీమ్స్‌ ఫెస్ట్‌కు దారి తీసింది. రోజుకో రకంగా ఈ వీడియోను రీ క్రియోట్ చేస్తూ.. నవ్వులుపూయిస్తున్నారు కొందరు. తాజాగా ఓ టిక్ టాక్ యూజర్ ఒకరు.. ఈ ఎపిసోడ్‌ను అద్బుతంగా ఎడిటింగ్ చేసి, నెట్టింట్లోకి వదిలాడు. ఇంకేముంది మనోడి ఎడిటింగ్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. అద్భుతంగా నటించావని కొందరు, సూపర్ ఎడిటింగ్ బ్రో అంటూ కామెంట్లు, షేర్లు చేస్తూ తెగ సందడి చేస్తూ వైరల్ గా మార్చారు. ట్విట్టర్ యూజర్ బీ అభిషేక్‌గురేజా.. టిక్‌టాక్ యూజర్ క్రియోట్ చేసిన ఈ వీడియోను పోస్ట్ చేశాడు.

రొనాల్డో ఏం చేశాడంటే.. యూరో కప్‌లో పోర్చుగల్, హంగేరి ల మధ్య ఓ మ్యాచ్ జరగనుంది. ఈమేరకు మ్యాచ్‌కు ముందు విలేకరుల సమావేశంలో రొనాల్డో.. తన ముందు ఉంచిన రెండు కోక్ బాటిళ్లను గుర్తించాడు. వెంటనే ఆ బాటిళ్లను అక్కడి నుంచి తీసేశాడు. వాటికి బదులు మీడియాకు ఓ వాటర్ బాటిల్ చూపిస్తూ గట్టిగా వాటర్ అంటూ అరిచాడు. అప్పటి నుంచి ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటూనే ఉంది. మరోవైపు డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్ కు ముందు విరాట్ కోహ్లీపై కూడా ఈ వీడియోను వాడేశారు నెటిజన్లు. ఇలా రోజుకో రకంగా రొనాల్డో ఎపిసోడ్ ట్రెండింగ్ అవుతూనే ఉంది.

ఈ ఫన్నీ వీడియోలో ఏముందంటే.. టిక్‌టాక్ యూజర్‌ స్మార్ట్ టీవీ తెరపై రోనాల్డో తో మాట్లాడుతున్నట్లు వీడియో క్రియోట్ చేశాడు. అనంతరం రోనాల్డో కు కోకాకోలా బాటిళ్లను ఇవ్వాలని సైగ చేశాడు. దీంతో రోనాల్డో ఆ బాటిళ్లను పక్కకు నెట్టాడు.. ఈ టిక్‌టాక్ యూజర్ టెలివిజన్ వెనుక నుంచి ఆ రెండు బాటిళ్లను బయటకు తీసి అలా నడుచుకుంటూ వెళ్లాడు. ఆ బాటిళ్లను తనకోసమే పక్కకు పెట్టినట్లుగా ఈ వీడియోను క్రియోట్ చేశాడు ఆ యూజర్.

మరోవైపు రొనాల్డో చర్య తర్వాత కోకాకోలా మార్కెట్ విలువ 4 బిలియన్ డాలర్ల మేర తగ్గింపోయింది. ఈ సంఘటన తర్వాత కోకాకోలా ఒక ప్రకటనలో “ప్రతి ఒక్కరూ తమ డ్రింక్‌ను ఎంచుకునే అర్హత ఉందంటూ పేర్కొంది. ప్రతి ఒక్కరికి భిన్నమైన అభిరుచులు, అలాగే అవసరాలు ఉంటాయని ” రాసుకొచ్చింది.

Also Read:

Viral Videos: సో క్యూట్.. ప‌క్షుల‌తో ఆడుకుంటున్న బుల్లి ఏనుగు భలే.. భ‌లే..!

Viral Video: వర్క్ ఫ్రమ్ హోమ్ డ్యూటీ చేస్తున్న యజమాని.. అది నచ్చని కుక్క ఏం చేసిందో చూస్తే నవ్వాపుకోలేరంతే..

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్