Viral Video: వరుడిని అవమానించిన వధువు… దిమ్మ తిరిగిన పెళ్లి కొడుకు ఏం చేశాడో చూస్తే షాకే

వధువు చేసిన పనికి కోపంతో ఊగిపోయిన వరుడు ఎలా ప్రవర్తించాడో చూస్తే నవ్వుతోపాటు ఆశ్చర్యం కూడా వేస్తోంది.

Viral Video: వరుడిని అవమానించిన వధువు... దిమ్మ తిరిగిన పెళ్లి కొడుకు ఏం చేశాడో చూస్తే షాకే
Viral Video

Updated on: Aug 02, 2021 | 1:16 PM

Viral Video: పెళ్లిళ్లకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే కొన్ని వీడియోలు మనల్ని నవ్విస్తుంటాయి. మరికొన్ని మాత్రం కన్నీళ్లను తెప్పిస్తాయి. అయితే, ప్రస్తుతం ఈ వీడియో మిమ్మల్ని కచ్చితంగా నవ్విస్తుంది. వేదికపై వధు, వరులు చేసిన పనికి చుట్టూ ఉన్నవారు కూడా నవ్వుతూనే ఉన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, వధూవరులు వేదికపై ఒకరికొకరు పూలమాల వేసుకున్నట్లు చూడవచ్చు. అయితే ఇందులో విశేషం ఏముందంటారా.. వీరు పూలమాల వేసుకునే తీరులోనే అసలు వింత ఉంది. అది చూసి మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. మొదట వధువు దండను వరుడిపై విసురుతుంది. అదికాస్తా.. వరుని మెడలో పడకుండా.. తలపై పడుతుంది. దానికి ఆగ్రహం వ్యక్తం చేసిన వరుడు.. అసహనంతో తలకు పూనకం వచ్చిన వాడిలా ఊపుతూ.. ఆ దండను కింద పడేస్తాడు. అనంతరం వరుడు కోపంగా వధువుపై దండను విసురుతాడు. అదికూడా ఆమె మెడలో పడకుండా తలపై పడుతుంది.

ఈ వీడియోను ప్రజలను బాగానే ఆకట్టుకుంటోంది. చాలామంది కామెంట్లు చేస్తూ వధూవరులను ఆడుకోవడం ప్రారంభించారు. అసలు అక్కడ ఏం జరుగుతోంది బ్రదర్ అంటూ ఒకరు కామెంట్ చేయగా, దండ మెడలో పడకపోతే అంత కోపం ఎందుకు బ్రో అంటూ మరొకరు కామెంట్ చేశారు. ఈ వీడియోను సౌరభ్ కశ్యప్ అనే యూజర్ జులై 20 న ఫేస్‌బుక్‌లో షేర్ చేశాడు. ఇద్దరిలో ఎవరిది తప్పు అంటూ ఈ వీడియోకి క్యాప్షన్‌ అందించాడు. ఇప్పటి వరకు 45 వేలకు పైగా లైక్‌లతో ఈ వీడియో దూసుకపోతోంది. 1300 పైగా కామెంట్లు చేశారు.

Also Read: Viral Video: మనుషుల గ్యాంగ్ వార్ చూశారు.. మరి కోతుల గ్యాంగ్ వార్ చూశారా? అయితే ఇప్పుడు చూసేయండి..

Viral Video: నడిరోడ్డుపై యువతి హాల్‌చల్‌.. వ్యక్తిని ఎగిరెగిరి కొడుతూ రచ్చ.. హ్యష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌!