నీటిలో ఉండే మొసలితోనూ, అడవిలో ఉండే సింహంతోనూ గేమ్స్ అంటే చావును కోరి తెచ్చుకున్నట్లే అంటుంటారు. అంతటి భయంకరమైన సింహంతో ఎదురుగా సవాలు చేసే జంతువు అడవిలో ఉండదు. ఇవి రంగంలోకి ఎంట్రీ ఇస్తే భారీ జంతువులు కూడా తమ దారిని మార్చుకుంటాయి. అయితే తాజాగా ఓ జంతువును చూసి అడవికే కింగ్ అయిన సింహం కూడా ఆగిపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఓ సింహాల గుంపు హిప్పోపొటామస్ (hippopotamus) నుంచి ఎంతో దూరంలో కనిపించిన వీడియో(Wildlife Video) ఒకటి నెట్టింట్లో సందడి చేస్తోంది.
హిప్పోపొటామస్ ప్రశాంతమైన జంతువు. కానీ, కోపం వస్తే మాత్రం సింహం, పులి, మొసలి, ఎలుగుబంటి కంటే చాలా ప్రమాదకరమైనదని నిరూపించగలదు. ఈ విషయం తెలిసి ఇతర జంతువులేవీ హిప్పోపొటామస్ జోలికి వెళ్లవు. అవి ఉన్న ప్రాంతానికి దూరంలోనే నిలిచిపోతాయి. తాజాగా ఇలాంటి హిప్పో (హిప్పోపొటామస్), సింహాల మందకు సంబంధించిన ఆశ్చర్యకరమైన వీడియో బయటపడింది.
వీడియోలో మీరు మూడు సింహాలు తమ దారిలో వెళుతున్నట్లు చూడవచ్చు. ఈ సమయంలో వాటికి ఎదురుగా నిలబడి ఉన్న హిప్పోపొటామస్‌పై పడతాయి. అవి దాని భారీ శరీరాన్ని చూసి చాలా భయపడ్డట్లు చూడొచ్చు. దీంతో దానిని వేటాడే ధైర్యం చేయలేదు. ఈ షాకింగ్ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో నెటిజన్లు ఈ వీడియోను చూసి ఆశ్చర్యపోతున్నారు. దీనికి 25 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. హిప్పో బరువు దాదాపు 2.5 టన్నులు లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది. తమ ప్రాంతంలోకి మొసలి ఎంటర్ అయినా ప్రాణాలతో తిరిగి రావడం కష్టంగా ఉంటుంది.
Even the king respects the right of passage…
Lion stopping to give way to the bird.
?Animales y bichitos pic.twitter.com/ZNiH5xI4hj— Susanta Nanda IFS (@susantananda3) March 1, 2022
Watch Video: బ్యాట్స్‌మెన్‌ను భయపెట్టిన పొలార్డ్.. అలా బ్యాటింగ్ చేస్తావా అంటూ.. వైరల్ వీడియో