Viral Video: పాము కల(Snakes In Dreams)లోకి వస్తేనే భయపడతాం.. అలాంటి పాము కంటికి ప్రత్యక్షంగా కనిపిస్తే.. అది ఎటువంటి పాము అయినా సరే భయంతో పరుగులు తీస్తాం.. ఎందుకంటే పాము అంటే విషపూరిమైనవి(Posion Snakes) అయినా.. విషం లేనివి అవి ప్రమాదకమైనవని చాలా మందికి నమ్మకం.. మరి అలాంటి పాము.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 అడుగులున్న పాము అర్ధరాత్రి రోడ్డు మీద షికారు చేస్తూ.. కనిపిస్తే.. ఒక్కసారిగా హార్ట్ ఎటాక్ వచ్చినంత పని అవ్వడం ఖాయం. తాజాగా ఓ అతిపొడవైన పాము.. రోడ్డు దాటుతోంది. దీనిని ఎవరో తమ కెమెరాలో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.
ఒడిశాలోని నబరంగపూర్ జిల్లాలో ఈ భారీ పాము కనిపించింది. సుమారు 25 నుంచి 30 అడుగుల పొడవు ఉంటుందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ పాము కత్తిగూడ జవహర్ నవోదయ విద్యాలయ సమీపంలో రోడ్డు దాటుతున్న సమయంలో స్థానికులు గుర్తించారు. రోడ్డు దాటుతున్న పాము.. రోడ్డు మరో చివరకు చేరుకున్నా.. పాములోని మరో సగభాగం ఇంకా రోడ్డు ఇవతలే ఉండి పోవడం చూసి షాక్ తిన్నారు. ఈ అతిపెద్ద సర్పాన్ని చూసిన చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడైనా తమ ప్రదేశంలోకి వస్తుందేమో అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పాము రోడ్డు దాటుతుండగా చూసిన వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ భారీ పాము నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.
A Giant snake of 25 -30 ft was spotted while crossing the main road at Khatiguda area of Odisha’s Nabrangpur District on Friday Night.#snake #Roadies @aajtak @IndiaToday pic.twitter.com/aczlPG33tp
— Mohammad Suffian (@iamsuffian) April 9, 2022
Also Read: Knowledge: భారతదేశంలో జీరో మైల్‌స్టోన్ ఎక్కడుందో తెలుసా.? దీని వెనక ఉన్న అసలు చరిత్ర ఇదే..