Monkey: కోతికి అంత్యక్రియలు..పెద్ద సంఖ్యలో పాల్గొన్న వానరాలు.!
మనిషి మరణిస్తే కుటుంబ సభ్యులు సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలను నిర్వహిస్తారు. బంధుమిత్రులు, చుట్టుపక్కలవారు పెద్ద సంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొని ఆ వ్యక్తికి అంతిమ వీడ్కోలు పలుకుతారు. ఇది మానవ ధర్మం. ఈమధ్యకాలంలో పెంపుడు జంతువులు చనిపోయినా వాటి యజమానులు అభిమానంతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తుండటం మనం చూస్తున్నాం.
ప్రమాదవశాత్తు ఓ కోతి ఇటీవలే మృతి చెందితే ఆ గ్రామస్తులంతా కలిసి ఆ కోతిని స్మశానానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. తాజాగా వికారాబాద్ జిల్లాలో మరో వానరం మృతి చెందింది. ఈ వానరానికి కూడా గ్రామస్తులంతా అదే పద్ధతిలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ విశేషమేంటంటే.. ఈ వానరం అంతిమ యాత్రలో పెద్దసంఖ్యలో కోతులు పాల్గొన్నాయి. వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని మోత్కూర్ గ్రామంలో అస్వస్థతకు గురై ఒక కోతి మరణించడంతో గ్రామంలోని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు గ్రామపంచాయతీ సిబ్బంది ఆ వానరానికి అంతిమయాత్రను ఘనంగా నిర్వహించారు. ఆ వానరం అంతిమయాత్రలో గ్రామస్తులే కాదు, తోటి వానర సైన్యం కూడా పాల్గొంది. అంతిమయాత్ర తుది వరకు యాత్రలో పాల్గొని అంతిమ సంస్కారం పూర్తయ్యేవరకు అక్కడే ఉన్నాయి. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కోతి అంతమయాత్రలో పాల్గొన్న వానరసైన్యాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. పశుపక్ష్యాదులు సైతం అనుబంధాలకు అతీతం కాదని చర్చించుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.