భూమి తిరగడం ఎప్పుడైనా చూశారా.. అద్భుతమైన వీడియో

భూమి తిరగడం ఎప్పుడైనా చూశారా.. అద్భుతమైన వీడియో

Phani CH

|

Updated on: Sep 03, 2022 | 9:40 AM

భూమి గుండ్రంగా తిరుగుతుంది అని చదువుకున్నాం.. విన్నాం కూడా.. కానీ ఎప్పుడూ చూడలేదు. తాజాగా ఓ శాస్త్రవేత్త భూ భ్రమణాన్ని ప్రత్యక్షంగా చూశారు.

భూమి గుండ్రంగా తిరుగుతుంది అని చదువుకున్నాం.. విన్నాం కూడా.. కానీ ఎప్పుడూ చూడలేదు. తాజాగా ఓ శాస్త్రవేత్త భూ భ్రమణాన్ని ప్రత్యక్షంగా చూశారు. ఆస్ట్రేలియాకు చెందిన ఈ శాస్త్రవేత్త అంతరిక్షం నుంచి 1,28,000 అడుగుల ఎత్తునుంచి దూకి భూమిమీదకు చేరుకున్నాడు. అంతరిక్షం నుంచి భూమికి చేరేందుకు ఈ వ్యోమగామి 1236 కి.మీ. ప్రయాణాన్ని 4 నిమిషాల 5 సెకన్లలో పూర్తి చేశారు. అతను భూమి కదులుతున్న దృశ్యాన్ని స్పష్టంగా చూశారు. ఆ అద్భుతాన్ని వీడియోగా అందించారు కూడా. స్కైన్యూస్‌ కథనం ప్రకారం ఈ వీడియోను 15వ అక్టోబర్ 2012న “Felix Baumgartner skydives from the space” అనే శీర్షికతో ప్రచురించింది. వీడియో వివరణలో, అంతరిక్షం నుండి దూకిన వ్యక్తి ఆస్ట్రియన్ స్కైడైవర్ ఫెలిక్స్ బామ్‌గార్ట్‌నర్, ఆస్ట్రేలియన్ వ్యోమగామి కాదు. స్కైడైవర్ ఫెలిక్స్ బామ్‌గార్ట్‌నర్ భూమి నుండి 1,28,097 అడుగుల ఎత్తు నుండి దూకి చరిత్ర సృష్టించాడని తెలిపారు. ఫెలిక్స్ బామ్‌గార్ట్నర్ ఒక పెద్ద హీలియం బెలూన్ నుండి దూకిన తర్వాత, తన పారాచూట్ తెరవడానికి ముందు నాలుగు నిమిషాల 19 సెకన్ల పాటు ఫ్రీ-ఫాల్ అయ్యాడని ఇందులో తెలిపారు. దీనిపై మరింత సమాచారం కోసం ఇంటర్నెట్లో వెతకగా, 14 అక్టోబర్ 2012న BBC న్యూస్ ప్రచురించిన కథనంలో అదే వీడియో కనిపించింది. ఈ కథనం ప్రకారం, ఆస్ట్రియన్ స్కైడైవర్ ఫెలిక్స్ బామ్‌గార్ట్‌నర్ అక్టోబర్ 14, 2012లో, రెడ్ బుల్ స్ట్రాటోస్ మిషన్‌లో భాగంగా రికార్డ్ బద్దలు కొట్టే స్కై డైవ్ చేసారు. బామ్‌గార్ట్‌నర్ 1,28,097 అడుగులు లేదా భూమి నుండి దాదాపు 24 మైళ్ల ఎత్తు నుండి భూమి పైకి దూకి, ఎతైన స్కైడైవ్‌గా ప్రపంచ రికార్డును సృష్టించినట్లు ఆ రిపోర్ట్ చెప్తుంది. ధ్వని వేగం కంటే వేగంగా ప్రయాణించిన మొదటి స్కైడైవర్‌గా బామ్‌గార్ట్నర్ అవతరించినట్లు అందులో రాసారు. ఇదే విషయాన్ని రిపోర్ట్ చేస్తూ, ‘Space.com’ వెబ్‌సైట్ ఫెలిక్స్ బామ్‌గార్ట్‌నర్ యొక్క రికార్డ్-బ్రేకింగ్ సూపర్‌సోనిక్ జంప్‌పై కథనాన్ని ప్రచురించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Pawan Kalyan: ఆ ఒక్క విషయంలో ఈయన ఎప్పటికీ తగ్గడు.. అందుకే అతను పవర్ స్టార్

Viral: వామ్మో !! రెండు మొసళ్ల మధ్య ఫైట్‌ ఎప్పుడైనా చూశారా ??

Nikhil: పవన్ కోసం తీసుకున్న ఒక్క నిర్ణయం.. ఈ హీరోను నిలబెడుతోంది

Pawan Kalyan: దిమ్మతిరిగేలా చేస్తున్న పవన్‌ మేనియా..

పేరుకు స్టార్ హీరోయిన్.. కాని అప్పనంగా 2 కోట్లు నొక్కేసింది !!

Published on: Sep 03, 2022 09:40 AM