Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇరవైల్లోనే అరవైలా మార్చేసే వ్యాధి.. ఈ లక్షణాలు మీకున్నాయా.. వీడియో

ఇరవైల్లోనే అరవైలా మార్చేసే వ్యాధి.. ఈ లక్షణాలు మీకున్నాయా.. వీడియో

Samatha J

|

Updated on: Feb 27, 2025 | 1:41 PM

ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఎముకలు బలహీనపడే సమస్యతో బాధపడుతున్నారు. ఒకప్పుడు 40 ఏళ్లు దాటిన వారిలో ఎముకల మధ్య గుజ్జు తగ్గిపోవడం, పెలుసుగా మారడం, నడుస్తున్నప్పుడు ఎముకలు క్రాక్ అవుతున్న శబ్దాలు రావడం కనిపించేవి. ఇప్పుడు టీనేజీ పిల్లలో కూడా ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా తలెత్తుతూ ఉంటుంది. ఉదయం లేవడమే టీ, కాఫీలు తాగే అలవాటు ఉన్నవారు, కూల్ డ్రింకులు తాగేవారిలో ఎముకలు బలహీనపడటం మొదలవుతుంది. దీనివల్ల ఆస్టియోపోరొసిస్ అనే ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. అయితే, ప్రతి సమస్యకి పరిష్కారం ఉన్నట్టే దీన్ని కూడా చాలా తేలికపాటి ఆహార నియమాలతో తగ్గించుకోవచ్చు. మళ్లీ మీ ఎముకలను ఉక్కులా తయారు చేసుకోవచ్చు.

ఎముకలు బలంగా తయారుకావడానికి పాలు, ఆకుకూరలు, బలవర్థకమైన ఆహారాలు, కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. మంచి కొవ్వుకలిగిన పదార్థాలు, చేపలు, పాలు, రాగులు వంటి విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల ఎముకలు మళ్లీ తిరిగి సాధారణ స్థితికి వస్తాయి. డైరీ ఉత్పత్తులైన పాలు, పెరుగు, జున్ను వంటివి కాల్షియంను అందించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని రోజుకు ఒక్కసారైనా తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారతాయి. తాజా కూరగాయలు అధికంగా ఉండే ఆహారం చిన్నప్పటి నుంచే పిల్లలకు అలవాటు చేయడం వల్ల యుక్తవయసు వచ్చేసరికి వారి ఎముకలు మరింత బలంగా మారుతాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన ఎముకలు ఏర్పడతాయి. బరువులు మోసే అలవాటు ఉన్నవారిలో సాధారణంగానే ఎముకలు రాటుతేలుతాయి. రోజులో కనీసం కొంత సమయం వెయిట్ లిఫ్టింగ్ ప్రయత్నించడం వల్ల తిన్న ఆహారం ఎముకలకు పరిపూర్ణంగా అందుతుంది. ఎముక సాంద్రత తక్కువగా ఉన్నవారితో సహా వృద్ధులలో ఎముక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవడం ఎముకల నష్టానికి దారితీస్తుంది, అందుకే తినే ఆహారంలో ప్రొటీన్‌ అధికంగా ఉండేలా చూసుకోవాలి.

మరిన్ని వీడియోల కోసం :

వ్యక్తి శరీరంలో 5 కిడ్నీలు..ఢిల్లీ డాక్టర్ల అద్భుతం వీడియో

ఆకాశంలో అద్భుతం..ఒకే లైన్​లోకి 7 గ్రహాలు.. ఎప్పుడు చూడొచ్చంటే..

కోడిని కోర్టుకు లాగిన వ్యక్తి.. నిద్ర చెడగొడుతోందని ఫిర్యాదు .. ఏమైందంటే..

వామ్మో.. 2025లో చాలా ఘోరాలు జరగబోతున్నాయా?