మనిషి దోసిట నీళ్లు తాగిన చింపాంజీ .. తర్వాత ఏం చేసిందంటే ??
మనుషులు కోతినుంచి వచ్చాడని అంటుంటారు. చాలామంది దీన్ని నమ్ముతారు. ఎందుకంటే కోతులు, వాటి వర్గానికి చెందిన చింపాంజీల ప్రవర్తన చూస్తే అలాగే అనిపిస్తుంటుంది. ఇవి అచ్చం మనుషుల్లా ప్రవర్తిస్తుంటాయి. చింపాంజీలు అరటిపండును మనిషిలాగే తొక్క ఒలుచుకుని దర్జాగా తింటుంటాయి. బాధ కలిగినప్పుడు చాతీని బాదుకుంటూ ఏడుస్తుంటాయి. అయితే, ఓ చింపాంజీ అడుగు ముందుకేసి ఓ వ్యక్తి చేతులను నీటితో కడిగి కృతజ్ఙత తెలియచేసింది.
మనుషులు కోతినుంచి వచ్చాడని అంటుంటారు. చాలామంది దీన్ని నమ్ముతారు. ఎందుకంటే కోతులు, వాటి వర్గానికి చెందిన చింపాంజీల ప్రవర్తన చూస్తే అలాగే అనిపిస్తుంటుంది. ఇవి అచ్చం మనుషుల్లా ప్రవర్తిస్తుంటాయి. చింపాంజీలు అరటిపండును మనిషిలాగే తొక్క ఒలుచుకుని దర్జాగా తింటుంటాయి. బాధ కలిగినప్పుడు చాతీని బాదుకుంటూ ఏడుస్తుంటాయి. అయితే, ఓ చింపాంజీ అడుగు ముందుకేసి ఓ వ్యక్తి చేతులను నీటితో కడిగి కృతజ్ఙత తెలియచేసింది. ఈ అద్భుత వీడియో నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది. ఆఫ్రికాలోని కామెరూన్‌లో చింపాంజీతో తన అనుభవాన్ని ఫ్రెంచ్ ఫోటోగ్రాఫర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు. వీడియోలో చింపాంజీకి దాహం వేసి ఓ నీటి గుంట దగ్గరకు వెళుతుంది. ఫొటోగ్రాఫర్ JC పియరీ చేతులు పట్టుకుని వెంట తీసుకెళుతుంది. అతని దోసిట్లో నీరు నింపి బయటకు తీసి తాగుతుంది. మూడు సార్లు నీరు తాగిన తర్వాత, ఇప్పుడు చింపాంజీ చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. జెసీ పియరీ చేతుల్ని నీటితో శుభ్రం చేయడం ప్రారంభిస్తుంది. కుంటలో నీటిని తీసి పియరీ చేతులపై పోస్తుంది. నీరు పోస్తూ చేతులను కలిపి రుద్దుతూ శుభ్రపరుస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
13 ఏళ్లుగా సుద్ద ముక్కలే ఆమెకు ఆహారం.. అన్నం ముట్టదు !!
కుక్కల కోసం హై క్లాస్ ఓల్జేజ్ హోం !! సంగీతం వినడం కోసం మ్యూజిక్ సిస్టమ్‌ను ఏర్పాటు
Chandrayaan-3: మూన్ మిషన్‌పై విక్రమ్ సారాభాయ్ వారసుని మాట..
Jailer: 566కోట్లు ఏంది సామి! హిస్టరీ క్రియేట్ చేసిన రజినీ
Bhagavanth Kesari: అప్పుడే 70కోట్లను తాకిన బిజినెస్.. పుంగి బజాయిస్తున్న కేసరి