మొన్నటివరకు కరోనా వ్యాప్తితో అతలాకుతలమైన ముంబై, ప్రస్తుతం భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతుంది. అక్కడి నాలాలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లు, రైల్వే ట్రాకులపై నీరు ప్రవహిస్తూ ఉండటంతో.. రవాణా సేవలకు అంతరాయం కలుగుతుంది. దీంతో ముంబై ఆర్థిక రాజధాని అయినప్పటికీ, నివసించడం చాలా ప్రమాదకరమైన నగరం అని చాలామంది అంటున్నారు. తాజాగా ఓ వీడియోను చూపిస్తూ వారు ఆ విషయాన్ని బలంగా చెబుతున్నారు. సదరు వీడియోలో ఇంటి ముందు ఆపి ఉంచిన కారు.. సింక్ హెల్‌లో మునిగిపోయింది. గత నాలుగు రోజులుగా ముంబైలో భారీ వర్షం కురుస్తోంది. దాదర్, సియోన్, మాతుంగా, లోయర్ పరేల్, మెరైన్ డ్రైవ్ సహా ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు కొంతవరకు ప్రజా జీవితాన్ని దెబ్బతీశాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో ముంబైలోని ఘాట్కోపర్ ప్రాంతానికి చెందినది. కారు అక్కడి ఇంటి ముందు ఆపి ఉంచబడింది. అయితే, కుండపోత వర్షాల కారణంగా ఈ ప్రాంతంలో చాలా నీరు, బురద పేరుకుపోయింది. ఈ క్రమంలో ఘాట్కోపర్ ప్రాంతంలో నేల లోపలికి ఉర్లిపోయి తొలుత కారు ముందు భాగం, చక్రాలు.. గొయ్యిలోకి జారిపోయాయి. కొద్ది సెకన్లతో కారు పూర్తిగా లోపలికి దిగిపోయింది. ఆ పక్కనే ఉన్న కారు మాత్రం అలాగే ఉంది. ఇంటి ముందు గుంటలో పడి కారు అదృశ్యమవడంతో చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత ముంబై నివసించడానికి సురక్షితమైన ప్రదేశమా? అనే ప్రశ్నను చాలామంది సంధిస్తున్నారు.
వీడియో చూడండి:
Scary visuals from Mumbai’s Ghatkoper area where a car drowned in few seconds. pic.twitter.com/BFlqcaKQBo
— Shivangi Thakur (@thakur_shivangi) June 13, 2021
Also Read: హైదరాబాద్‌లో R15 బైక్‌పై వచ్చి కుక్క కిడ్నాప్.. ఆచూకీ తెలిపినవారికి 10 వేల రివార్డ్
భర్తతో గొడవపెట్టుకుని ఇంటి నుంచి వెళ్లిపోయిన భార్య.. ఆమె పెట్టె చెక్ చేసి అతడు కంగుతిన్నాడు