Viral: ఒకే ముహూర్తం.. ఇద్దరిని చేసుకుంటున్న ఒక్క మగాడు..! వెడ్డింగ్ కార్డ్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..!
పెళ్లంటే నూరేళ్ల పంట.. పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోయే మధురానుభూతి. అందుకే ప్రతి జంట తమ వివాహాన్ని ఎంతో ప్రత్యేకంగా, కలకాలం గుర్తుండిపోయేలా చేసుకుంటారు. అయితే, పెళ్లి ద్వారా స్త్రీ,
పెళ్లంటే నూరేళ్ల పంట.. పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోయే మధురానుభూతి. అందుకే ప్రతి జంట తమ వివాహాన్ని ఎంతో ప్రత్యేకంగా, కలకాలం గుర్తుండిపోయేలా చేసుకుంటారు. అయితే, పెళ్లి ద్వారా స్త్రీ, పురుషుడు ఒక్కటవ్వడం ఇప్పటి వరకు చూశాం. మరి ఒక్క పెళ్లితో ఇద్దరు స్త్రీలు, ఒక పురుషుడు ఒక్కటవ్వడం ఎప్పుడైనా చూశారా? అవును, ఇది నిజం.. ఒక వ్యక్తి ఇద్దరు అమ్మాయిలను ఒకే ముహూర్తానికి పెళ్లి చేసుకుంటున్నాడు. భద్రాద్రి కొత్తగూడెంలో ఈ వింత పెళ్లికి వేదికైంది. చర్ల మండలంలోని కుర్నపల్లి గ్రామానికి చెందిన సత్తిబాబు.. ఒకే ముహూర్తానికి ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్నాడు. వ్యవసాయ కూలీ అయిన సత్తిబాబు అదే గ్రామానికి చెందిన సునీతతో పెళ్లి నిశ్చయమైంది. అయితే అప్పటికే దోశిళ్లపల్లికి చెందిన స్వప్న కుమారిని సత్తిబాబు ప్రేమించాడు. విషయం తెలుసుకున్న సునీత సత్తిబాబును నిలదీసింది. లెక్క తేల్చేందుకు పెద్దలు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. చివరికి స్వప్నతో వివాహం జరిపించేందుకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలిపారు. సత్తిబాబు మార్చి 9వ తేదీన గురువారం ఉదయం 7.04 గంటలకు స్వప్న, సునితల మెడలో తాళిబొట్టు కట్టనున్నాడు. ఇందుకు సంంధించి బంధుమిత్రులకు శుభలేఖలు పంపారు. ఆ శుభలేఖలో వరుడి పేరు, ఇద్దరు వధువుల పేర్ల ఉండటంతో అంతా షాక్ అయ్యారు. అయితే, సత్తిబాబు పెళ్లి శుభలేఖ సోషల్ మీడియాలో తెగ అవైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్ ఫీవర్.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!