విశాఖ ఆర్కే బీచ్‌‌ తీరంలో విషపూరిత జెల్లీఫిష్‌.. ఈత కొట్టేవారికి పెనుముప్పు

|

Apr 06, 2024 | 5:13 PM

విశాఖపట్టణం ఆర్కేబీచ్‌లో విషపూరితమైన జెల్లీఫిష్ సంతతిని పరిశోధకులు గుర్తించారు. వీటి సంతతి ఇంకా పెరిగితే మత్స్యపరిశ్రమ దెబ్బతినడంతో పాటు పర్యాటకం కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సముద్రతీర ప్రాంతాల్లో అంతరించిపోతున్న మత్స్యజాతులపై పరిశోధనలు చేస్తున్న బృందం నిన్న విశాఖలో పర్యటించింది. ఈ సందర్భంగా ఆర్కేబీచ్‌లో ఈ ప్రమాదకర జెల్లీఫిష్‌ను గుర్తించారు.

విశాఖపట్టణం ఆర్కేబీచ్‌లో విషపూరితమైన జెల్లీఫిష్ సంతతిని పరిశోధకులు గుర్తించారు. వీటి సంతతి ఇంకా పెరిగితే మత్స్యపరిశ్రమ దెబ్బతినడంతో పాటు పర్యాటకం కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సముద్రతీర ప్రాంతాల్లో అంతరించిపోతున్న మత్స్యజాతులపై పరిశోధనలు చేస్తున్న బృందం నిన్న విశాఖలో పర్యటించింది. ఈ సందర్భంగా ఆర్కేబీచ్‌లో ఈ ప్రమాదకర జెల్లీఫిష్‌ను గుర్తించారు. దీనిని మావ్ స్టింగర్ లేదంటే పర్పుల్‌ stripped జెల్లీఫిష్‌గా పిలుస్తారు. దేశంలోని తీర్పు తీరంలో అరుదుగా కనిపించే జెల్లీఫిష్ మూడు నుంచి ఐదు సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. తేలియాడే బెలూన్‌ను పోలి ఉండే ఊదారంగులో ఉన్న జెల్లీఫిష్ జాతులను చూసిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. రుషికొండ వద్ద ఇసుక బీచ్‌లో రాళ్ల మధ్య నీటిలో వీటిని గుర్తించారు. ఇవి విరేచనాలు, నొప్పి, వాంతులు, అనాఫిలాక్టిక్ షాక్ వంటి అనారోగ్య సమస్యలకు కారణమవుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇషా అంబానీ ఇంటిని కొన్న హాలీవుడ్ న‌టి.. ఆమె ఆస్తులెంతో తెలుసా ??

ఈ మందుబాబు ఐడియా అదిరింది మావా.. ఏం చేశాడో చూడండి

600 మంది ఉద్యోగులను తొలగించిన మరో దిగ్గజ కంపెనీ

అప్పటికే 45 కోట్ల వసూళ్లు.. ఇది కొండన్న క్రేజ్‌ అంటే

ఇదేందిరా ఇది !! ప్రభాస్‌కు తాతగా సంజయ్‌ దత్‌ !!

.

Follow us on