Vandhe Bharat Viral Video: వందేభారత్‌ను లాక్కెళుతున్న పాత ఇంజిన్.. అసలు వాస్తవం ఇది.
దేశంలోని మొదటి సెమీ హై స్పీడ్ రైలు వందే భారత్. దీనిని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. అత్యాధునిక సదుపాయాలతో ఈ రైళ్లను తయారు చేశారు. ప్రస్తుతం దేశంలో 23 వందేభారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. అయితే వందేభారత్ ప్రవేశపెట్టినప్పటి నుంచి తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి.
వందే భారత్ మొరాయించడంతో దీనిని పాత ఇంజిన్ లాక్కెళ్తోందని, ఆర్భాటంగా ప్రారంభించిన వందేభారత్ రైళ్ల వాస్తవ పరిస్థితి ఇదీ అంటూ కొందరు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కృష్ణ కూడా దీనిని షేర్ చేస్తూ, తొమ్మిదేళ్ల అబద్ధాలను 70 ఏళ్ల చరిత్ర లాక్కెళ్తోందంటూ ట్వీట్ చేశారు. హైస్పీడ్ రైళ్లంటూ ఊదరగొట్టారని, చివరకు కాంగ్రెస్ తెచ్చిన ఇంజిన్లే దిక్కయ్యాయంటూ పలువురు ట్వీట్ చేశారు. ఈ విమర్శలపై రైల్వే శాఖ స్పందించింది. ఈ వీడియోపై ఈస్ట్ సెంట్రల్ రైల్వే స్పందిస్తూ… ఇది ఇంకా ప్రారంభం కాని వందే భారత్ రైలు అని స్పష్టం చేసింది. రూట్ కూడా ఖరారు కాలేదని, ఒకసారి రూట్ ఖరారైతేనే లోకో పైలట్లు, సిబ్బంది అందుబాటులోకి వస్తారని తెలిపింది. ఈ వీడియోను యూపీకి చెందిన శశాంక్ అనే వ్యక్తి సకల్ దిహా రైల్వే స్టేషన్ సమీపంలో తీశాడు. చెన్నై ఇంటిగ్రెల్ కోచ్ ఫ్యాక్టరీ నుండి పాట్నా తరలిస్తున్నట్లు పేర్కొన్నాడు. అయితే ప్రారంభం కాని వందే భారత్ ను ఇంజిన్ లాక్కెళ్తుండటంతో దీనిని మరోవిధంగా అర్థం చేసుకున్నవారు విమర్శిస్తూ ట్వీట్ చేశారు. అందులో ప్రయాణికులు, సిబ్బంది లేరని పేర్కొన్నప్పటికీ.. కేవలం వీడియోను మాత్రమే డౌన్‌లోడ్ చేసి కొందరు తమదైన కామెంట్లు జోడించడంతో ఈ వీడియో వైరల్ అయ్యింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...