పాస్తా ఉడకలేదని రూ.40 కోట్లు నష్ట పరిహారం దావా !!

Updated on: Dec 03, 2022 | 9:51 AM

తమ వస్తువులను అమ్ముకోవడానికి ఉత్పత్తిదారులు రకరకాల ప్రచారాలను చేసుకుంటాయి. ఇప్పుడు అదే వారి పీకల మీదకు తెచ్చింది. ‘రెండు నిమిషాల్లో రెడీ.. 3 నిమిషాల్లో రెడీ..’ అని ఇన్‌స్టంట్‌ ఫుడ్‌ ప్యాకెట్స్‌పై వివరాలు ఇస్తుంటాయి కంపెనీలు.

తమ వస్తువులను అమ్ముకోవడానికి ఉత్పత్తిదారులు రకరకాల ప్రచారాలను చేసుకుంటాయి. ఇప్పుడు అదే వారి పీకల మీదకు తెచ్చింది. ‘రెండు నిమిషాల్లో రెడీ.. 3 నిమిషాల్లో రెడీ..’ అని ఇన్‌స్టంట్‌ ఫుడ్‌ ప్యాకెట్స్‌పై వివరాలు ఇస్తుంటాయి కంపెనీలు. వాటిని ఉడికించబోతే చెప్పిన సమయం కంటే ఎక్కువే తీసుకుంటాయి. అది మామూలేలే.. అని మనం పట్టించుకోం. కానీ.. ఫ్లోరిడాకు చెందిన ఓ మహిళ ఊరుకోలేదు. చెప్పిన టైమ్‌లో పాస్తా ఉడకలేదని ఫుడ్‌ కంపెనీపై 40కోట్ల రూపాయల నష్ట పరిహారం కోరుతూ దావా వేసింది. అమాండా రెమీరేజ్‌ అనే మహిళ.. క్రాఫ్ట్‌ హీంజ్‌ కంపెనీకి చెందిన వెల్వెటా షెల్స్‌ పాస్తా అండ్‌ ఛీజ్‌ను కొనుగోలు చేసింది. దాన్ని మైక్రోవేవ్‌లో ఉడికిస్తే.. మూడున్నర నిమిషాల్లో రెడీ అయిపోతుందని ప్యాక్‌పై రాసి ఉంది. కానీ అందులో వివరించినట్టుగా మూడున్నర నిమిషాల్లో పాస్తా అండ్‌ ఛీజ్‌ ఉడకలేదు. దీంతో చిర్రెత్తుకొచ్చిన సదరు మహిళా న్యాపోరాటానికి దిగింది. ప్యాక్‌పై ఉన్న వివరాలు వినియోగదారులను పక్కదారి పట్టించే విధంగా ఉందని అమాండా ఆరోపించింది. పరిహారం కింద 40 కోట్ల రూపాయలు, జరిగిన నష్టానికి 80 లక్షల రూపాయలు చెల్లించాలని కోర్టులో కేసు వేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విద్యార్థుల బరితెగింపు.. క్లాస్ రూమ్‌లో టీచర్‌కు లైంగిక వేధింపులు !!

మొసళ్లు వాటి పిల్లలను తింటాయా ?? వీడియో చూస్తే వణుకు పుట్టాల్సిందే

ఒక్క మాట అన్న లెక్చరర్‌ను కడిగి పారేసిన విద్యార్థి !! ధైర్యానికి ఫిదా అయిపోతున్న నెటిజన్లు

చోర శిఖామణి.. మాటల్లో పెట్టి రూ.10 లక్షల నెక్లెస్‌ భలే కొట్టేసిందిగా !!

బిడ్డకోసం ఆ తల్లి పడిన తపన.. హార్ట్‌ టచ్చింగ్‌ వీడియో

 

Published on: Dec 03, 2022 09:51 AM