మహిళలపై లాఠీ ఝళిపించిన మగ పోలీసులు.. వీడియో వైరల్ !!
ఉత్తరప్రదేశ్ పోలీసులు మహిళలపై లాఠీలు ఝులిపించారు. కింద పడేసి మరి కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఉత్తరప్రదేశ్ పోలీసులు మహిళలపై లాఠీలు ఝులిపించారు. కింద పడేసి మరి కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్ జిల్లా జలాల్‌పూర్‌లో జరిగింది. ఇటీవల ఆ ప్రాంతంలో బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై మహిళలు నిరసన వ్యక్తం చేశారు. విగ్రహం ధ్వంసం చేసిన ప్రాంతానికి చేరుకున్న కొంత మంది మహిళలు.. ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. పోలీసుల వాహనాలపై మహిళలు రాళ్లు రువ్వడంతో వారిని చెదరగొట్టే ప్రయత్నంలో భాగంగా ఇలా చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. అయితే మహిళలను మగ పోలీసులు కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై పోలీసులపై తీవ్ర విమర్శాలు వెల్లువెత్తుతున్నాయి. ఆందోళనకారులలో కొందరు.. సీనియర్ అధికారితో సహా పోలీసులపై రాళ్లు రువ్వారని పోలీసులు తెలిపారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు మైనర్ ఫోర్స్ ఉపయోగించాల్సి వచ్చిందంటున్నారు పోలీసులు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Guinness World Records: వారెవా.. చప్పట్లతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్..
బయటపడిన అత్యంత అరుదైన మరకతం !! ఏకంగా కిలోన్నర !!
సూర్యుడికంటే 10 రెట్లు పెద్దదైన బ్లాక్ హోల్.. భూమికి అతి దగ్గరగా..
తమ్ముడి మాటలకు.. అన్నకు కన్నీళ్లు ఆగేలదు !!
Rashmika Mandanna: సోషల్ మీడియా ట్రోల్స్‌పై .. రష్మిక ఎమోషనల్ పోస్ట్
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
వామ్మో.. తుని రైల్వే స్టేషన్లో పాముల కలకలం..ఇదిగో వీడియో
మీ జీతం వారంలోపే అయిపోతోందా? వృథా ఖర్చు ఎక్కడ అవుతోందో తెలుసా
ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!
క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం..
యజమాని మెసేజ్‌కు ఫిదా నెటిజన్లు

