Minister Dharampal Singh: కారులోనే రైల్వే ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకొచ్చిన మంత్రి.. వీడియో వైరల్.
సాధారణ జనానికి వర్తించే నియమ నిబంధనలు.. కొన్ని సందర్భాల్లో కొందరికి మాత్రం వర్తించవు. అధికారం పేరుతో యథేచ్ఛగా వ్యవహరించిన సన్నివేశాలు చూసే ఉంటాం. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోనూ ఓ మంత్రి ఇలాంటి నిర్వాకానికే పాల్పడ్డారు. ఏకంగా తన కారును రైల్వే ప్లాట్‌ఫాంపైకి తెచ్చేశారు. ఆ రాష్ట్ర పాడిపరిశ్రమల శాఖ మంత్రి ధరమ్‌పాల్‌సింగ్ లక్నో నుంచి రాయబరేలి వెళ్లేందుకు హౌరా-అమృత్‌సర్ ఎక్కాల్సి ఉంది.
సాధారణ జనానికి వర్తించే నియమ నిబంధనలు.. కొన్ని సందర్భాల్లో కొందరికి మాత్రం వర్తించవు. అధికారం పేరుతో యథేచ్ఛగా వ్యవహరించిన సన్నివేశాలు చూసే ఉంటాం. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోనూ ఓ మంత్రి ఇలాంటి నిర్వాకానికే పాల్పడ్డారు. ఏకంగా తన కారును రైల్వే ప్లాట్‌ఫాంపైకి తెచ్చేశారు. ఆ రాష్ట్ర పాడిపరిశ్రమల శాఖ మంత్రి ధరమ్‌పాల్‌సింగ్ లక్నో నుంచి రాయబరేలి వెళ్లేందుకు హౌరా-అమృత్‌సర్ ఎక్కాల్సి ఉంది. అయితే.. రైల్వే స్టేషన్ దాకా కారులో వచ్చిన మంత్రి.. లోపలి దాకా నడవటం ఎందుకు అనుకున్నారేమో.. ఏకంగా తన కారును ప్లాట్‌ఫాంపైకి తీసుకుపోవాలని డ్రైవర్‌ను ఆదేశించారు. మంత్రి గారి అర్డర్ శిరసా వహించిన కారు డ్రైవర్.. రైల్వే ప్లాట్‌ఫాంపైకి తెచ్చేశారు. వీల్‌చైర్లు నడిచేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ర్యాంపు పైకి ఎక్కిన కారు.. నేరుగా చార్‌బాగ్ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాం4పైకి రావడంతో అక్కడున్న జనం తెల్లబోయారు. రైలు అందుకునేందుకు లేట్ అవడంతో ఇలా రావాల్సి వచ్చిందని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఆయనకు నడవడం ఇష్టం లేకే కారులో రైలు దాకా వచ్చారని అక్కడున్నవారు చర్చించుకుంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..