Flipkart Order: రూ.76 వేల మ్యాక్‌బుక్‌ ఆర్డర్ చేస్తే.. ఏమొచ్చిందో తెలుసా.! చూస్తే షాక్..

Flipkart Order: రూ.76 వేల మ్యాక్‌బుక్‌ ఆర్డర్ చేస్తే.. ఏమొచ్చిందో తెలుసా.! చూస్తే షాక్..

Anil kumar poka

|

Updated on: Aug 28, 2023 | 8:37 AM

ఆధునిక కాలంలో క్రయవిక్రయాలు క్షణాల్లో జరుగుతున్నాయి. టెక్నాలజీ పెరిగిపోయి ఏమి కావాలన్నా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుని, ఉన్న చోటే కావలసిన వస్తువులను పొందుతున్నారు. ఎక్కువగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ కామర్స్ సైట్లలో బట్టలు, చెప్పులు దగ్గర నుంచి ల్యాప్‌టాప్స్ వరకు అన్ని బుక్ చేసుకుంటున్నారు. ఈ ఆన్‌లైన్‌ షాపింగ్ సైట్లలో అప్పుడప్పుడు కొన్ని అవకతవకలు జరుగుతుంటాయి.

ఆధునిక కాలంలో క్రయవిక్రయాలు క్షణాల్లో జరుగుతున్నాయి. టెక్నాలజీ పెరిగిపోయి ఏమి కావాలన్నా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుని, ఉన్న చోటే కావలసిన వస్తువులను పొందుతున్నారు. ఎక్కువగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ కామర్స్ సైట్లలో బట్టలు, చెప్పులు దగ్గర నుంచి ల్యాప్‌టాప్స్ వరకు అన్ని బుక్ చేసుకుంటున్నారు. ఈ ఆన్‌లైన్‌ షాపింగ్ సైట్లలో అప్పుడప్పుడు కొన్ని అవకతవకలు జరుగుతుంటాయి. ఇలాంటి సంఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. అథర్వ ఖండేల్‌వాల్ అనే వ్యక్తి ఫ్లిప్‌కార్ట్‌లో యాపిల్ మ్యాక్ బుక్ కోసం ఆర్డర్ చేశాడు. అయితే అతనికి డెలివరీ విషయంలో కొంత ఆలస్యం జరిగింది. అతడే నేరుగా ఫ్లిప్‌కార్ట్‌ హబ్‌కు వెళ్లి ఆర్డర్ తీసుకున్నాడు. పార్సిల్ ఓపెన్ చేసి చూడగానే ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాడు అథర్వ. అందులో మ్యాక్ బుక్ బదులు బోట్ స్పీకర్స్ ఉన్నాయి. నిజానికి అతడు బుక్ చేసుకున్న యాపిల్ మ్యాక్ బుక్ ధర అక్షరాల 76 వేల రూపాయలు. అయితే అతనికి కేవలం 3 వేల రూపాయల విలువైన బోట్ స్పీకర్స్ రావడంతో ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. అతనికి జరిగిన నష్టాన్ని రీఫండ్ చేయాలనీ క‌స్టమ‌ర్ కేర్‌కు ఫోన్ చేసి అడిగితే.. రీఫండ్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పినట్లు సమాచారం. ఇందుకు సంబందించిన సమాచారం అతడు సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. చివరికి ఫ్లిప్‌కార్ట్ ల్యాప్‌టాప్ అమౌంట్ రీఫండ్ చేస్తుందా? లేదా అన్నదీ తేలాల్సి ఉంది.!

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...