గాయపడిన పక్షికి చికిత్స చేసి చేరదీస్తే జైల్లో వేస్తారా ??

|

Apr 09, 2023 | 9:11 PM

కొంగతో స్నేహం చేసినందుకు ఓ యువకుడిపై ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. అంతేకాదు అతని నేరం నిరూపణ అయితే జైలు శిక్ష, జరిమానా కూడా విధించే అవకాశం ఉందట. ఉత్తర్ ప్రదేశ్ లోని అమేథీ నివాసి ఆరిఫ్ గుర్జార్ తన పొలంలో గాయపడి కదలలేని స్థితిలో ఉన్న కొంగను చేరదీసి చికిత్స చేసాడు.

కొంగతో స్నేహం చేసినందుకు ఓ యువకుడిపై ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. అంతేకాదు అతని నేరం నిరూపణ అయితే జైలు శిక్ష, జరిమానా కూడా విధించే అవకాశం ఉందట. ఉత్తర్ ప్రదేశ్ లోని అమేథీ నివాసి ఆరిఫ్ గుర్జార్ తన పొలంలో గాయపడి కదలలేని స్థితిలో ఉన్న కొంగను చేరదీసి చికిత్స చేసాడు. అందుకు కృతజ్ఞతగా ఆ కొంగ అతనితోనే వుండిపోయింది. అతను కొంగకు నయం అయ్యాక వెళ్లిపోతుందనుకున్నాడు. కానీ అలా జరగలేదు. అప్పటినుంచి సరయు అనే ఆ కొంగ-ఆరిఫ్‌కి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆరిఫ్‌ ఎక్కడికి వెళ్లినా ఆ కొంగ అతని వెంటే వెళ్తుంది. అతన్ని వదిలి ఒక్క క్షణం కూడా ఉండదు ఆ మూగజీవి. అందుకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలు అటవీశాఖ అధికారుల దృష్టికి చేరుకున్నాయి. వెంటనే అటవీశాఖ అధికారులు సరయును ఆరీఫ్‌ నుంచి వేరు చేశారు. వన్యప్రాణులను ఇళ్లలో పెంచకూడదంటూ రాయ్‌బరేలీలోని సమస్పూర్ అభయారణ్యంలో కొంగను వదిలి పెట్టారు. కానీ ఆ కొంగ అక్కడ ఇమడలేకపోయింది. ఆరిఫ్‌ను వెతుక్కుంటూ మళ్లీ అతనివద్దకు వచ్చేసింది. అటవీశాఖ అధికారులు మళ్లీ పట్టుకున్నారు. ఈసారి కాన్పూర్ జూకి తరలించారు. అక్కడ్నుంచి తప్పించుకోలేకపోయింది కొంగ. దాంతో అది ఆహారం తినడం మానేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రిలీజ్‌కు ముందే 40 కోట్లు.. ఓరేంజ్‌లో.. నిఖిల్ రేంజ్‌

దిమ్మతిరిగే తుఫాన్ ఆన్‌ద వే.. జపాన్‌లో రిలీజ్‌కు రంగస్థలం..

అయిపోయాడు.. మళ్లీ ట్రోలర్స్‌కు దొరికిపోయాడు

బన్నీ ఫ్యాన్స్ దాటికి.. చిరిగిన 70MM స్క్రీన్

థియేటర్లో చిచ్చుబుడ్డి కాల్చడం ఏంట్రా..

Published on: Apr 09, 2023 09:11 PM