నడి రోడ్డుపై కుర్చీ వేసుకుని కూర్చున్న వ్యక్తి.. ఆ తర్వాత ??

|

Sep 03, 2024 | 9:00 PM

ఓవైపు జోరున వర్షం కురుస్తోంది.. రోడ్డుపై వాహనాలు వేగంగా వెళుతున్నాయి. ఇంతలో ఓ వ్యక్తి కుర్చీ తీసుకుని రోడ్డుపైకి వచ్చాడు. నడి రోడ్డుపై అడ్డంగా కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. అక్కడ ఉన్న వారితో పాటు వాహనదారులు లెమ్మని అరుస్తున్నా కిమ్మనకుండా అలానే కూర్చున్నాడు. ఇంతలో దూసుకొచ్చిన ఓ ట్రక్కు ఆ వ్యక్తిని ఢీ కొట్టి వెళ్లిపోయింది. యూపీలోని కొత్వాలి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

ఓవైపు జోరున వర్షం కురుస్తోంది.. రోడ్డుపై వాహనాలు వేగంగా వెళుతున్నాయి. ఇంతలో ఓ వ్యక్తి కుర్చీ తీసుకుని రోడ్డుపైకి వచ్చాడు. నడి రోడ్డుపై అడ్డంగా కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. అక్కడ ఉన్న వారితో పాటు వాహనదారులు లెమ్మని అరుస్తున్నా కిమ్మనకుండా అలానే కూర్చున్నాడు. ఇంతలో దూసుకొచ్చిన ఓ ట్రక్కు ఆ వ్యక్తిని ఢీ కొట్టి వెళ్లిపోయింది. యూపీలోని కొత్వాలి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ మనిషిని ఢీకొట్టిన తర్వాత కూడా ఆపకుండా వెళ్లిపోయిన ట్రక్ డ్రైవర్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ చెక్‌పోస్ట్‌కి దగ్గర్లోనే ఈ ఘటన జరిగినా ఎవరూ పట్టించుకోలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఆ ట్రక్ ను గుర్తించామని, డ్రైవర్ పై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. ఇక నడి రోడ్డుపై కుర్చీ వేసుకున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా పొంతనలేని సమాధానం ఇస్తున్నాడని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా.. ఆ వ్యక్తికి మతిస్థిమితం లేదని తెలిపారని వివరించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌.. పెరిగిన ధర

జియో ఫ్రీ స్టోరేజ్‌ ఎఫెక్ట్‌.. గూగుల్‌, యాపిల్‌ క్లౌడ్‌ స్టోరేజ్‌ ధరలు తగ్గేనా ??

షూటింగ్‌ కారవాన్‌లలో సీక్రెట్‌ కెమెరాలు.. ప్రైవేట్‌ వీడియోలు

గూగుల్ మ్యాప్స్ నమ్ముకుని అడవిలో 15 కి.మీ

అమెరికాలో చోరీకి వెళ్లి యువతిని కాల్చి చంపిన భారత సంతతి వ్యక్తి