ఇటీవల పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా వాటిని చాలా ఇష్ట పతారు. ప్రతి ఒక్కరు తమ వివాహం ప్రత్యేకంగా ఉండాలని భావించడంతో.. కొత్త దనం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. చాలావరకు అవి సక్సెస్ అయినా ఒక్కోసారి బెడిసికొడుతుంటాయి. అలాంటి వీడియో ఒకటి నెట్టింట ఇప్పుడు వైరల్‌గా మారింది. మరి ఈ పెళ్లిలో ఏం జరిగిందో మీరూ చూసేయండి.
ఓ కొత్త జంట వివాహం తర్వాత పార్టీ ఏర్పాటు చేసింది. అందరిలా కాకుండా ఈ పార్టీలో తాము కొంచెం భిన్నంగా కనిపించాలనుకున్నారు. ఇందుకోసం వారు ఓ క్రేన్‌ను ఏర్పాటు చేశారు. క్రేన్ బకెట్‌ను అందంగా అలంకరించారు. దానిపై వారు కూర్చోగానే క్రేన్ వారిని పది అడుగుల ఎత్తులోకి తీసుకెళ్లింది. కింద పార్టీ కోలాహలంగా జరుగుతుండగా, పైన వారు అందరినీ చూస్తూ సంతోషంగా ఉన్నారు. అంతా సాఫీగా సాగిపోతుందనుకున్న టైంలో అనుకోని ఘటన జరిగింది. ఏమైందో ఏమో కానీ వారు కూర్చున్న క్రేన్ బకెట్ ఒక్కసారిగా కిందికి వంగిపోయింది. అనుకోని ఈ హఠాత్ పరిణామం నుంచి వారు తేరుకునేలోపే కిందనున్న టేబుల్‌పై అమాంతం పడ్డారు. అంతెత్తునుంచి వారు పడడంతో టేబుల్ ధ్వంసమైంది. ఇది చూసిన అతిథులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. ఎంతపని జరిగిపోయిందంటూ అందరూ తలలు పట్టుకున్నారు. . వెంటనే తేరుకుని వధూవరులను లేపి కూర్చోబెట్టారు. ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఆ జంట ఎవరు? అన్న వివరాలు తెలియదుకానీ… ఇన్‌స్టాగ్రామ్‌లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోపై కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
మరిన్ని చూడండి ఇక్కడ:
jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..