Ukrainian Couple: పెళ్లైన మరుసటి రోజే.. తుపాకీ పట్టిన యువ జంట.! రీజన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..! వైరల్ అవుతున్న వీడియో..

|

Mar 09, 2022 | 9:43 AM

ఉక్రెయిన్ దేశంపై దాడి చేస్తున్న నేపథ్యంలో మాతృ భూమి రక్షణ కోసం ఉక్రెయిన్లు స్వయంగా కదన రంగంలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ ప్రేమ జంట వివాహ బంధంతో ఒక్కటైన మర్నాడే రష్యా సైనికులను ఎదుర్కోవడానికి ఉక్రెయిన్ రక్షణ దళంలో చేరారు.


ఉక్రెయిన్ దేశంపై దాడి చేస్తున్న నేపథ్యంలో మాతృ భూమి రక్షణ కోసం ఉక్రెయిన్లు స్వయంగా కదన రంగంలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ ప్రేమ జంట వివాహ బంధంతో ఒక్కటైన మర్నాడే రష్యా సైనికులను ఎదుర్కోవడానికి ఉక్రెయిన్ రక్షణ దళంలో చేరారు.ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్‌లోని సెయింట్ మైకేల్స్ గోల్డెన్ డోమ్డ్ మొనాస్టరీలో 21 ఏళ్ల యారినా అరివా, 24 ఏళ్ల స్వియాటోస్లావ్ ఫర్సిన్ పెళ్లి చేసుకున్నారు. వివాహ జరిగిన 24 గంటల తర్వాత ఈ కొత్త జంట రష్యా కు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి ఉక్రెయిన్ రక్షణ దళంలో చేరారు. 2019 అక్టోబర్‌లో కీవ్‌లో జరిగిన నిరసనలో యారీనా, స్వియాటోస్లావ్‌ల మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లితో ఒక్కటవ్వాలని భావించారు. అయితే ఇంతలో యుద్ధం ముంచుకు రావడంతో.. తమ భవిష్యత్తు ఏమిటో తెలియక ముందే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఒక్కటయ్యారు. తమ మాతృ భూమిని రక్షించుకోవడానికి తాము చేయగలిగినదంతా చేస్తామంటోంది ఈ కొత్త జంట. రక్షణ దళ అధికారులు తమకు ఎటువంటి విధులను కేటాయించినా నిర్వహిస్తామని చెప్పారు. ఏదో ఒకరోజు తమ దేశంలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయని, తమ జన్మభూమి తమకు దక్కుతుంది.. రష్యన్లు లేకుండా తమ దేశం సురక్షితంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ మా వైవాహిక జీవితాన్ని కూడా సంతోషంగా గడుపుతామని ఈ కొత్త జంట ఆశిస్తోంది.

మరిన్ని చూడండి ఇక్కడ:
Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…

Rana Daggubati: విభిన్న పాత్రలకి కేరాఫ్ అడ్రస్ ఆయన.. బళ్లాళ దేవ అయినా.. డానియెల్ శేఖర్ అయినా..! ట్రెండ్ మార్చిన ‘రానా’ ఫొటోస్

Rashmika Mandanna: కొంటె చూపులతో కవ్విస్తున్న ‘శ్రీవల్లి’.. గ్లామర్ డోస్‌లో ‘తగ్గేదేలే’.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫోటోలు..

Jacqueline Fernandez: అబ్భురపరిచే వయ్యారాలతో చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ ‘జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌’..ఫొటోస్