Mas copying: వాడి టాలెంట్‌కు ఇన్విజిలేటర్ షాక్..! పరీక్షలో మెడికల్ స్టూడెంట్ హైటెక్ కాపీ.. వైరల్ అవుతున్న వీడియో
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ మెడికల్ స్టూడెంట్ పరీక్షలో పాస్ అయ్యేందుకు హైటెక్ కాపీ చేశాడు. ఆ స్టూడెంట్ టాలెంట్‌కు ఇన్విజిలేటర్ సైతం షాకయ్యాడు. ఇండోర్‌లోని ఎంజీఎం మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఓల్డ్ బ్యాచ్‌కు చెందిన ఇద్దరు విద్యార్ధులు మొబైల్స్ ద్వారా మాస్ కాపీయింగ్ చేస్తూ పట్టుబడ్డారు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ మెడికల్ స్టూడెంట్ పరీక్షలో పాస్ అయ్యేందుకు హైటెక్ కాపీ చేశాడు. ఆ స్టూడెంట్ టాలెంట్‌కు ఇన్విజిలేటర్ సైతం షాకయ్యాడు. ఇండోర్‌లోని ఎంజీఎం మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఓల్డ్ బ్యాచ్‌కు చెందిన ఇద్దరు విద్యార్ధులు మొబైల్స్ ద్వారా మాస్ కాపీయింగ్ చేస్తూ పట్టుబడ్డారు. పరీక్ష జరుగుతున్న సమయంలో ఇన్విజిలేటర్‌కు ఆ ఇద్దరు విద్యార్ధుల తీరు అనుమానాస్పదంగా కనిపించడంతో ఆరా తీయగా.. విషయం మొత్తం బయటికి వచ్చింది. ఆ ఇద్దరి దగ్గర నుంచి మొబైల్ ఫోన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. పట్టుబడిన ఇద్దరు విద్యార్ధుల్లో ఒకడు.. కాపీ కొట్టే విషయం బయటకు తెలియకుండా ఉండేలా మైక్రో బ్లూటూత్ పరికరాన్ని ఏకంగా చెవిలో సర్జరీ ద్వారా అమర్చుకున్నాడట.
పరీక్ష ప్రారంభమైన గంటలోనే ఎగ్జామ్ సెంటర్‌కు ఫ్లైయింగ్ స్క్వాడ్ వచ్చింది. వారు పూర్తిగా సెర్చ్ ఆపరేషన్ చేయగా.. ఇద్దరు విద్యార్ధుల ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించింది. వారిలో ఒకడి నుంచి మొబైల్‌ను స్వాధీనం చేసుకున్న స్క్వాడ్.. ఆ ఫోన్‌కు బ్లూటూత్ కనెక్ట్ అయ్యిందని గుర్తించారు. దాని కోసం మొత్తం క్లాసు తనిఖి చేశారు. పట్టుబడిన మరో విద్యార్ధిని కూడా క్షుణ్ణంగా చెక్ చేయగా.. బ్లూటూత్ జాడ ఎక్కడా దొరకలేదు. అరగంట సేపు ఆ ఇద్దరినీ మరోసారి గట్టిగా అడగ్గా.. చివరికి అందులో ఒకడు తన చెవిలో బ్లూటూత్ అమర్చబడిందని నిజం ఒప్పుకున్నాడు. కాగా, ఈ విద్యార్థి గత 11 సంవత్సరాలుగా ఈ పరీక్షను రాస్తూనే ఉన్నాడట… మళ్లీ మళ్లీ ఫెయిల్ అవుతూనే వచ్చాడట. ఇలాంటి తటస్థ పరిస్థితులలో చివరికి ఈ హైటెక్ కాపీకి దిగాడట. అయినా చివరికి ఇలా అడ్డంగా బుక్కయ్యాడు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…