Uber Driver: ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..

|

May 19, 2024 | 3:26 PM

ఇటీవల ఊబర్‌, ర్యాపిడో, ఓలా లాంటి ప్రయాణ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రయాణం చాలా సులువైపోయింది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా నిమిషాల్లో బైక్‌, లేదా క్యాబ్‌ బుక్‌ చేసుకొని సకాలంలో చేరాల్సిన చోటికి చేరుతున్నారు. దీనివల్ల ఎంతో సమయం ఆదా అవుతోంది. అయితే వీటి వల్ల ఒక్కోసారి మహిళా ప్రయాణికులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.

ఇటీవల ఊబర్‌, ర్యాపిడో, ఓలా లాంటి ప్రయాణ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రయాణం చాలా సులువైపోయింది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా నిమిషాల్లో బైక్‌, లేదా క్యాబ్‌ బుక్‌ చేసుకొని సకాలంలో చేరాల్సిన చోటికి చేరుతున్నారు. దీనివల్ల ఎంతో సమయం ఆదా అవుతోంది. అయితే వీటి వల్ల ఒక్కోసారి మహిళా ప్రయాణికులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. క్యాబ్‌ లేదా బైక్‌ రైడర్స్‌ విచిత్ర ప్రవర్తనతో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాజాగా ఓ మహిళా కస్టమర్‌ కారులో ఉండగానే క్యాబ్‌ డ్రైవర్‌ మాస్టర్‌ బేషన్‌ చేసుకోవడం మొదలు పెట్టాడు. అది చూసిన ఆ మహిళ తీవ్ర భయాందోళనకు గురైంది. ఆ తర్వాత ఎంతో తెలివిగా వ్యవహరించింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్ సిటీకి చెందిన టేలా పిమ్లాట్ అనే మహిళకు ఎదురైన అనుభవమిది. ఆమె స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించిన వివరాలు, ఆస్ట్రేలియా న్యూస్ డాట్ కామ్ వెబ్ సైట్ కథనం ప్రకారం..టేలా పిమ్లెట్ ఇటీవల ఓ రోజు ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లేందుకు ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకుంది. కారులో కూర్చున్నాక కాసేపటికి డ్రైవర్ ప్రవర్తన అసహజంగా అనిపించింది. సెల్ ఫోన్ కెమెరా ఆన్ చేసి చూడగా.. స్టీరింగ్ ముందు కూర్చున్న డ్రైవర్ ఒక చేత్తో కారు నడుపుతూ మరో చేత్తో మాస్టర్ బేషన్ చేసుకుంటున్నాడు.

పట్టపగలు.. చుట్టూ ట్రాఫిక్, వెనక సీట్లో ఓ మహిళ ఉందన్న జ్ఞానం లేకుండా డ్రైవర్ చేస్తున్న పనికి పిమ్లెట్ కు చిరాకు తెప్పించింది. ఆపై తాను ఒంటరిగా ఉన్నానని గుర్తొచ్చి భయాందోళన చెందింది. గట్టిగా అరిచినా, నిలదీసినా డ్రైవర్ తనపై అఘాయిత్యం చేయొచ్చని భయపడింది. దీంతో వెంటనే తన తల్లికి, బాయ్ ఫ్రెండ్ కు మెసేజ్ ద్వారా విషయం చేరవేసింది. ఆపై తన ఫోన్ లో డ్రైవర్ నిర్వాకాన్ని రికార్డు చేసింది. ఇంటికి చేరుకున్నాక తల్లి సాయంతో డ్రైవర్ ను నిలదీద్దామని ప్రయత్నించినా అది సరికాదనుకొని… వెంటనే ఉబెర్ కంపెనీకి, పోలీసులకు ఫోన్ లో ఫిర్యాదు చేసింది. సదరు డ్రైవర్ ను రహ్మన్ ఫాజెలిగా గుర్తించిన ఉబెర్ వెంటనే అతడిని సంస్థలో నుంచి తొలగించినట్లు ప్రకటించింది. పోలీసులు రహ్మాన్ ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం అతనికి నాలుగు వారాల జైలుశిక్ష విధించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.