బాయ్ ఫ్రెండ్ కోసం ఇద్దరు అమ్మాయిల సిగపట్లు
ప్రేమ కోసం ఒకప్పుడు యుద్ధాలే జరిగాయని చెప్పడం వినుంటారు. ఇటీవల కాలంలో ప్రేమ పేరుతో యువతలను వేధించడం వారిపై దాడి చేయడం చూస్తున్నాం. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక అబ్బాయిని ప్రేమించిన ఇద్దరు అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్ కోసం జుట్టు పట్టుకొని బాహాబాహీకి దిగారు. ఈ ఘటన బీహార్ లో చోటుచేసుకోగా ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒకే అబ్బాయిని ప్రేమించిన ఇద్దరు స్కూల్ విద్యార్థినులు మొదట వాగ్వాదానికి దిగారు. అలా గొడవ పడుతూ బయటకు వచ్చిన వారికి స్నేహితులు తోడయ్యారు. దాంతో అది కాస్త గ్రూప్ వార్ గా మారిపోయింది. ఈ ఇద్దరి తరఫున వారి స్నేహితులు కూడా బాహాబాహీకి దిగారు. ఈ యువతలు ఇద్దరు జుట్టు పట్టుకొని కొట్టుకుంటే వారికి వీరు చేత కలిశారు. దాంతో గొడవ కాస్త ముదిరి రెండు వర్గాలుగా చీలిపోయి విద్యార్థినులు రోడ్డుపై ఘోరంగా కొట్టుకున్నారు. కొందరు విద్యార్థినులు వారిని విడదీసే పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనను అటువైపు వెళ్తున్న వారు వీడియో తీసి నెట్టింట పెట్టడంతో అది కాస్త వైరల్ గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు బుద్ధిగా చదువుకోవాల్సిన సమయంలో ఇలాంటి దిక్కుమాలిన పనులు ఏంటి అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రం పూర్ణియా జిల్లాలో గులాబ్ బాగ్ హన్సాద రోడ్డులో సమీపంలో ఉండే ఒక ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘ఉప్మా వద్దు.. చికెన్ ఫ్రై, బిర్యానీ కావాలి’
ఆస్తి పంపకాల్లాగే అంత్యక్రియల పంపకం.. తండ్రి మృతదేహాన్ని
అందుకే అప్పుడు పవన్ కళ్యాణ్‌తో యాక్ట్ చేయలేదు
ప్రమాదవశాత్తు బావిలో పడిన పెద్దపులి, అడవిపంది… చివరిలో సూపర్ ట్విస్ట్

ఆదమరిచి నిద్రపోతున్న శునకం.. మేక ఏం చేసిందో చూడండి

ఎండ వేడి తట్టుకోలేక ఏసీ ఆన్ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో

పిచ్చి పీక్స్‌కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది

ఒక్క టూత్ బ్రష్‌తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి

ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..
