Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రమాదవశాత్తు బావిలో పడిన పెద్దపులి, అడవిపంది... చివరిలో సూపర్‌ ట్విస్ట్‌

ప్రమాదవశాత్తు బావిలో పడిన పెద్దపులి, అడవిపంది… చివరిలో సూపర్‌ ట్విస్ట్‌

Phani CH

|

Updated on: Feb 10, 2025 | 3:58 PM

ఇద్దరు బద్దశత్రువులకు ప్రమాదం ఎదురైనప్పుడు వారిరువురూ ఆప్తమిత్రుల్లా మారిపోతారు. అందుకు ఉదాహరణే ఈ ఘటన. పెద్దపులి, చిరుతపులుల ప్రధాన ఆహారం అడవి పందులు. అడవి పంది వీటి కంట పడిందో దానికి ఆ రోజుతో ఆయుష్షు ముగిసినట్టే. అలా ఓ అడవిపందిని వేటాడింది. పులి నుంచి తప్పించుకునేందుకు అడవిపంది పరుగందుకుంది.

వదిలేదే లేదన్నట్టు అడవి పందిని వెంబడించింది పెద్దపులి. ఈ క్రమంలో రెండు జంతువులూ ప్రమాదవశాత్తు ఓ బావిలో పడిపోయాయి. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి. రిజర్వ్ డిప్యూటీ డైరెక్టర్ రజనీష్ కుమార్ సింగ్ తెలిపిన వివరాలు ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని సియోనిలోని పెంచ్ నేషనల్ పార్క్‌లో ఒక ఆడపులి, అడవి పందిని వేటాడే క్రమంలో దానిని వెంబడించింది. ఈ క్రమంలో పొరపాటున అవి రెండూ బావిలో పడిపోయాయి. ఆహారం కోసం అడవి పందిని వెంబడించిన పులి తన వైరాన్ని మరిచిపోయింది. ఆ బావి నుంచి ఎలా బయటపడాలా అనే ఆలోచనలో పడింది. అడవిపంది పరిస్థితి కూడా అదే. అయినా పక్కన ఉన్నది తన బద్ధశత్రువు. ఏ క్షణంలో తనపై దాడిచేస్తుందోనని ఓ పక్క భయపడుతూనే తాను కూడా బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అలా ఆ రెండూ జంతువులూ ఎలాంటి దాడులకు పాల్పడకుండా 4 గంటలపాటు సంయమనంతో ఉన్నాయి. ఈ క్రమంలో జికురై అటవీ శ్రేణిలోని పిపారియా హర్దులి గ్రామంలో మంగళవారం ఉదయం గ్రామస్తులు బావి నుండి నీరు తీసుకెళ్లడానికి వచ్చారు. బావిలో ఉన్న క్రూర జంతువులను చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రమాదకర ‘మోబ్’ బాంబ్‌ తో.. ఇరాన్‌పై దాడికి ట్రంప్‌ ప్లాన్‌?

గల్లంతైన అలాస్కా విమానం దొరికింది

బహిష్కరణ భయంతో అమెరికాలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య

ఒళ్లంతా మొద్దుబారిపోయే.. పక్షవాతం లాంటి జబ్బు..

దుస్తులు తీసేసి ఫోటోలకు ఫోజులు.. గ్రామీ వేడుకల్లో షాకింగ్‌ ఘటన