‘ఉప్మా వద్దు.. చికెన్ ఫ్రై, బిర్యానీ కావాలి’
అంగన్వాడీలో పెడుతున్న భోజనం విషయంలో ఓ చిన్నారి చేసిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ దెబ్బకు ప్రభుత్వం కదిలి వచ్చింది. అంగన్వాడీ మెనూని మార్చేయాలని నిర్ణయించింది. కేరళ అంగన్వాడీ సెంటర్లో మెనూ మార్చే అంశంపై అక్కడి విద్యాశాఖ సమీక్ష జరుగుతోంది. అందుకు కారణం శంకర్ అనే ఓ చిన్నారి వీడియో వైరల్ కావడమే.
స్వయంగా రాష్ట్ర ఆరోగ్య శిశు మహిళా సంక్షేమ శాఖ మంత్రి వీణా జార్జ్ ఆ చిన్నారి వీడియోకు స్పందించి ఈ నిర్ణయం ప్రకటించారు. అంగన్వాడీలో ప్రతిసారి ఉప్మా పెడుతున్నారని దానికి బదులు బిర్యానీ, చికెన్ ఫ్రై కావాలంటూ ఆ చిన్నారి విజ్ఞప్తి చేశాడు. అమాయకంగా ఆ బుడ్డోడు చెప్పిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అయ్యాయి. చివరకు ఆ వీడియో ప్రభుత్వం దాకా వెళ్ళింది. దేంతో వీణా జార్జ్ స్పందించారు. అంగన్వాడీలో పిల్లలకు ఇప్పటికే కేరళ ప్రభుత్వం పౌష్టికాహారం అందిస్తుందని, పాలు, గుడ్లు అందిస్తున్నామని చెప్పారు. చిన్నారి శంకర్ చేసిన విజ్ఞప్తిని కూడా పరిగణలోకి తీసుకుంటామని ఆమె అన్నారు. మెనూను ఖచ్చితంగా సమీక్షిస్తామని తెలిపారు. ఆ వీడియోని చూశాక చాలా మంది తమకు ఫోన్లు చేశారని, చిన్నారికి బిర్యానీ, చికెన్ ఫ్రై ఇప్పిస్తామని అన్నారని వీణా జార్జ్ చెప్పారు. అంగన్వాడీలో పిల్లలకు అన్ని రకాల పోషకాలు అందించాల్సిన అవసరం ఉందని, అందుకే మెనూలో తప్పకుండా మార్పులు చేస్తామన్నారు ఆమె.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆస్తి పంపకాల్లాగే అంత్యక్రియల పంపకం.. తండ్రి మృతదేహాన్ని
అందుకే అప్పుడు పవన్ కళ్యాణ్‌తో యాక్ట్ చేయలేదు
ప్రమాదవశాత్తు బావిలో పడిన పెద్దపులి, అడవిపంది… చివరిలో సూపర్ ట్విస్ట్

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
